లాక్మే ఫ్యాషన్ వీక్: అక్షర్ హాసన్ హాట్ లుక్ అందిరింది

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ మూవీ ‘షమితాబ్' చిత్రం ద్వారా నటిగా తెరంగ్రేటం చేసిన కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్......తొలిసారిగా ర్యాంపు వాక్ చేసి వయ్యాలు ఒలకపోసింది. ఇటీవల ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్-రిసార్ట్స్ 2015లో ప్రముఖ డిజైనర్ కనిక్కా సల్లుజా డిజైన్ చేసిన దుస్తులతో ర్యాంప్ వాక్ చేసింది అక్షర.

ఈ సందర్భంగా అక్షర హాసన్ మాట్లాడుతూ..‘కనిక్కా డిజైన్స్ చాలా బావుంటాయి. డిఫరెంటుగా యూనిక్ లుక్ తో ఉండే ఆమె డిజైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమె నా ఫ్యాషన్ సోల్ మేట్' అని వ్యాఖ్యానించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఫ్యాషస్ వీక్‌కు హోటల్ పల్లాడియం వేదికైంది.

Akshara Haasan sizzles at the Lakme Fashion Week

అక్షర హాసన్ సినిమా లైఫ్ వివరాల్లోకి వెళితే...తమిళ నటుడు ధనుష్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన ‘షమితాబ్' చిత్రం ద్వారా ఆమె నటిగా తెరంగ్రేటం చేసింది. తొలి చిత్రంతోనే అక్షర హాసన్ మంచి పేరు తెచ్చుకుంది. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించి ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.

ప్రస్తుతం అక్షర హాసన్ సినిమాలేవీ చేయడం లేదు. ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేయడం కాకుండా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు సమచారం. త్వరలో ఆమె చేయబోయే తర్వాతి సినిమా వివరాలు వెల్లడికానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X