నాగబాబు కొడుకు ‘గొల్లభామ’లో అక్షర హాసన్
హైదరాబాద్ : నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బెంగుళూరులో జరిగిన మెగా అభిమానుల సభలో నాగబాబు ఈ విషయాన్ని ఖరారు చేసారు. తన కుమారుడు వరుణ్ తేజ్ మొదటి చిత్రం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాతగా తెరకెక్కబోతోందని, త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని నాగబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ చిత్రానికి 'గొల్లభామ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రంతో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయం అయ్యే అవకాశం ఉందనే ప్రచార జరుగుతోంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడట.


Click it and Unblock the Notifications











