Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కమల్ హాసన్ కూతురుతో నేను డేటింగ్ చేయడం లేదు
ముంబై: కమల్ హాసన్- సారికల కూతురు, శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ హీరోయిన్గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రంలో అక్షర హాసన్ నటిస్తోంది. ఇంకా హీరోయిన్గా పరిచయం కానేలేదు అప్పుడే ఎఫైర్లలో మునిగి తేలుతోంది అక్షర హాసన్ అంటూ ఈ మధ్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
బాలీవుడ్ నటుడు తనూజ్ విర్వానీతో అక్షర హాసన్ ఎఫైర్ నడుపుతోందని వార్తలు వచ్చాయి. అయితే అక్షర హాసన్ నుండి ఇప్పటి వరకు ఈ వార్తలపై ఎలాంటి స్పందన లేక పోయనా....తనూజ్ విర్వానీ మాత్రం స్పందించాడు. కమల్ హాసన్ కూతురుతో తాను డేటింగ్ చేయడం లేదని, అక్షర్ హాసన్ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. మీడియాలో మా మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు విని షాకయ్యానంటూ వివరణ ఇచ్చాడు.
దీంతో పాటు 'పురానీ జీన్స్' చిత్రంలో తనతో హీరోయిన్గా నటిస్తున్న విరాట్ కోహ్లీ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఇసబెల్లె లియెట్తో కూడా లింక్ చేస్తూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు విని మేము ఇద్దరం నవ్వు కుంటున్నాం. మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని తనూజ్ చెబుతున్నాడు. తనూజ్ విర్వానీ ఎవరో కాదు నిన్నటి తరం బాలీవుడ్ నటి రాటి అగ్రిహోత్ని కుమారుడు.