బాసరలో మంచు విష్ణు కూతుర్ల అక్షరాభ్యాసం
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కవల పిల్లలు అరియానా, వివియానా అక్షరాభ్యాస కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి అక్షరాభ్యాస కార్యక్రమం ప్రపంచ ప్రఖ్యాత బాసర(అదిలాబాద్)లోని సరస్వతి టెంపుల్‌లో జరిగినట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంచు విష్ణు దగ్గరుండి స్వయంగా చూసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా దీన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు ఫ్యామిలీ మెంబర్లతో పాటు వారి సన్నిహితులు, బంధువులు హాజరైనట్లు తెలుస్తోంది.
మంచు విష్ణకు తన కూతుర్లు అంటే ఎంతో ఇష్టం. ఎంత అంటే....కూతుర్లతో ఆడుకోవడానికి ప్రతి రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు. షూటింగులు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలైనంత వరకు వారితో గడపడానికి ట్రై చేస్తున్నాడు. అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత వీరిని స్కూల్‌లో చేర్పించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











