Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కింగ్ ను కాదు,జోకర్ని!
"నేను కింగ్‌ను కాదు, జోకర్‌ను మాత్రమే. జోకర్ లా ప్రేక్షకుల్ని నవ్వించడమే నాకిష్టం" అంటున్నాడు అక్షయ్‌కుమార్. కమల్ హాసన్ బ్రహ్మచారి రీమేక్ గా వచ్చిన 'కంభక్త్ ఇష్క్' విమర్శలు ఎదుర్కొంటున్నా కలెక్షన్స్ లో కింగ్ అనిపించుకుంది. అక్షయ్‌కుమార్ హీరోగా చేసిన ఈ చిత్రం మొదటివారంలోనే వంద కోట్లు వసూలు చేసి సూపర్ హిట్‌గా డిక్లేర్ చేయబడింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ రకమైన కామెంట్స్ చేసారు.
ప్రేక్షకులు తన చిత్రాన్ని బ్రహ్మాండంగా ఆదరిస్తున్నా, విమర్శకులు మాత్రం తన నటన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం అక్షయ్‌ను తీవ్రంగా బాధిస్తోంది. అందుకే మొదటివారంలోనే తను నటించిన చిత్రం వంద కోట్లు కలెక్ట్ చేసి, పరిశ్రమ వర్గాలు తనను కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని అభివర్ణిస్తుంటె తాను జోకర్ నేనని చెప్తున్నాడు. అక్షయ్ నటించిన 'చాందిని చౌక్ టు చైనా", '10 ఇంటూ 8 తస్వీర్" చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధించడం కీలకంగా మారింది.