twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మచారికి మళ్ళీ మూడ్

    By Staff
    |

    కమల్ హాసన్ బ్రహ్మచారికి మళ్ళీ మూడొచ్చింది. ఈ చిత్రం హిందీలో కంబర్క్ ఇష్క్ పేరుతో రీమేక్ అవుతోంది. కామిడీతో ఆధ్యంతం నవ్వించే ఈ సినిమాను చూసిన బాలీవుడ్ హీరో అక్షయ్ తన నిర్మాతల చేత కొనిపించాడు. ఈ చిత్రంలో కమల్ పోషించిన స్టంట్ మేన్ పాత్రను అక్షయ్ పోషిస్తున్నాడు. అయితే అతను హాలీవుడ్ స్టంట్ మేన్. అతను సిల్వస్టర్ స్టాలిన్, బ్రాండన్ రూత్ వంటివారికి ఫైట్స్ సమకూరుస్తూంటాడు. ఇక సిమ్రాన్ చేసిన డాక్టర్ పాత్రను మోడల్ గా మార్చారు. ఆ పాత్రను కరీనా కపూర్ చేస్తుంది. అలాగే అబ్బాస్ పాత్రను ఆఫ్తాద్ శివదాని,స్నేహ పాత్రను అమృత అరోరా చేస్తున్నారు. సాజిద్ నడియవాలా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని షబ్బీర్ ఖాన్ డైరక్ట్ చేస్తున్నాడు. అనుమాలికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా హిట్టయితే మన సౌత్ కామిడీలు చాలా భాగం అక్కడ అమ్ముడయ్యే ఆస్కారం ఉందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X