‘2.O’ అక్షయ్ కుమార్ రాక్షస లుక్ కోసం ఎంత శ్రమించారో.. (మేకింగ్ వీడియో)
Recommended Video

ఇండియన్ సినీ ప్రేక్షకలోకం మొత్తం నవంబర్ 29న విడుదలయ్యే '2.0' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లో అక్షయ్ కుమార్ రాక్షస రూపంలో జనాలను భయపెట్టాడు. చాలా మంది ఆయన లుక్ అంతా గ్రాపిక్స్ ద్వారా క్రియేట్ చేశారని అనుకుంటున్నారు. కానీ అక్షయ్‌ను ఆ లుక్‌లోకి తీసుకొచ్చేందుకు మేకప్ బృందం గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది అనేది కొందరికి మాత్రమే తెలుసు.
వీడియో షేర్ చేసిన అక్షయ్ కుమార్
2.0 విలన్ పాత్ర పోషిస్తున్న తాను మేకప్ విషయంలో ఎంత కష్టపడాల్సి వచ్చిందో వివరిస్తూ... అక్షయ్ కుమార్ ఓ వీడియో షేర్ చేశారు. ఇది కేవలం టెక్నికల్ వండర్ మాత్రమే కాదు, దీని వెనక ఎంతో శ్రమదాగి ఉంది అని తెలిపారు.

సెల్ ఫోన్లు వాడే వారిపై ప్రతీకారం
ఇందులో అక్షయ్ కుమార్ పాత్ర ఒక విచిత్రమైన క్యారెక్టరైజేషన్‌తో ఉండబోతోంది. సెల్ ఫోన్లు వాడే వారిని శత్రువులుగా భావిస్తూ వారిని టార్గెట్ చేస్తూ మారణకాండ సృష్టించే పాత్రలో అక్షయ్ కనిపించబోతున్నారు.

హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ
ఇందులో రజనీకాంత్ రోబో చిట్టిగా కనిపించబోతున్నారు, ఫిమేల్ రోబో పాత్రలో అమీ జాక్సన్ నటిస్తోంది. హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఉండబోతోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు రూ. 543 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇండియన్ సినీ చరిత్రలోనే గ్రాండ్ రిలీజ్
నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ రిలీజ్ అవ్వనంత భారీ సంఖ్యలో స్క్రీన్లలో ఇది విడుదల కాబోతోంది. కలెక్షన్ల పరంగా అన్ని రికార్డులను ఈ చిత్రం బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











