రెండు సినిమాలకు ఆ హీరో రెమ్యూనరేషన్ 80 కోట్లు?

అక్షయ్ కుమార్ తో త్వరలో రెండు సినిమాలు చేయబోతున్నట్లు నిర్మాత రమేష్ తౌరానీ ఖరారు చేసారు. అయితే రెమ్యూనరేషన్ వివరాలు వెల్లడించేందుకు మాత్రం రమేష్ తౌరానీ నిరాకరించారు. ఒక సినిమా ఈ సంవత్సరం జులై మొదటి వారంలో మొదలు కాబోతోందని, కేప్ టౌన్ లో షూటింగ్ జరుగుతుందని తెలిపారు. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు.
బోల్ బచ్చన్, గోల్ మాల్ రిటర్న్స్, హౌస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన సాజిద్ పర్హాద్ ఈచిత్రానికి కో డైరెక్టర్ గా పని చేయబోతున్నట్లు రమేష్ తౌరానీ వెల్లడించారు. మరో సినిమా 2014లో ప్రారంభమవుతుందని, ఆ సినిమాకు ఇంకా దర్శకుడు ఖరారు కాలేదని రమేష్ తౌరానీ తెలిపారు.
అక్షయ్ కుమార్ మంచి క్రమ శిక్షణ గల నటుడు, సూపర్ పెర్ఫార్మెర్, అతనితో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం. తొలిసారిగా అతనితో సినిమా చేయబోతున్నాం. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని రమేష్ తౌరానీ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.


Click it and Unblock the Notifications











