»   »  రూ. కోటి విరాళం ప్రకటించిన మరో మనసున్న స్టార్

రూ. కోటి విరాళం ప్రకటించిన మరో మనసున్న స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంపాదనలో మాత్రమే కాదు.... సహాయం చేయడంలోనూ తాను స్టారే అని నిరూపించుకున్నాడు. భారీ వరదలతో అతలాకుతలం అయిన చెన్నై నగరంలోని బాధితుల కోసం ఆయన రూ. 1 కోటి విరాళం అందించారు. చెన్నై బాధితులకు సహాయం చేయడంలో ముందున్న భూమిక ట్రస్ట్ కు ఆయన రూ. 1 కోటి విరాళం అందించారు.

Akshay Kumar donated Rs 1 Crore for Chennai Flood Relief

చెన్నై నగరంపై విరుచుకుపడ్డ ‌ప్రకృతి విళయం చూసి షాకైన అక్షయ్ కుమార్.... సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తనకు సన్నిహితుడైన సౌత్ డైరెక్టర్ ప్రియదర్శన్‌కు కాల్ చేసాడు. ఆయన ఈ వ్యవహారం విషయంలో నటి సుహాసిని మణిరత్నంను సంప్రదించాలని సూచించారు.

Akshay Kumar donated Rs 1 Crore for Chennai Flood Relief

సుహాసిని మణిరత్నం సలహా మేరకు ‘భూమిక ట్రస్ట్'కు రూ. 1 కోటి సహాయం అందించారు. చెన్నైలో ప్రకృతి విలయం సంప్రదించిన మరుసటి రోజు నుండి ఈ ట్రస్ట్ వరద బాధితులకు ఆహారం అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయం చేస్తోంది. అక్షయ్ కుమార్ పంపిన చెక్కును సుహాసిన మణిరత్నం... భూమిక ట్రస్ట్ మేజింగ్ ట్రస్టీ జయేంద్రకు అందజేసారు.

English summary
Bollywood Actor Akshay Kumar giving Rs. 1 Crore for Chennai Flood Relief activities. After Suhasini Maniratnam's suggestion, he donated Rs. 1 Crore to Bhoomika Trust who are doing the food prepartion and distribution in Chennai from the day of disaster.
Please Wait while comments are loading...