twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీ 'దూకుడు' హీరో ఖరారు.. సల్మాన్ కాదు

    By Srikanya
    |

    మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన దూకుడు చిత్రం హిందీ రీమేక్ పై చాలా కాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టుకు నో చెప్పటంతో చల్లబడింది. అయితే ఇప్పుడు తాజాగా తాను చేస్తానంటూ అక్షయ్ కుమార్ సీన్ లోకి వచ్చారు. ఈ చిత్రం చూసిన అక్షయ్ ఈ రీమేక్ లో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ సమాచారం.

    ఇక సల్మాన్ రిజెక్టు చేయటానికి కారణాన్ని రీసెంట్ గా కోన వెంకట్ చెప్తూ...సల్మాన్ ఖాన్ ఆల్రెడీ దబాంగ్ 2 లోనూ పోలీస్ గా కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మళ్ళీ పోలీస్ పాత్ర అనేసరికి నో అని చెప్పారు అన్నారు. ఇక అక్షయ్ కుమార్ ఈ ప్రాజెక్టు ఓకే చేయటం గురించి మాట్లాడుతూ...ఇంకా టాక్స్ ప్రాధమిక దశలోనే ఉన్నాయి. ఈ దశలో కామెంట్ చెయ్యటం భావ్యం కాదని అన్నారు.

    అయితే అక్షయ్ మాత్రం మహేష్ పాత్రకు ఫెరఫెక్టు గా సరిపోతారు అన్నారు. ఇక అక్షయ్ ప్రస్తుతం రవితేజ సూపర్ హిట్ విక్రమార్కుడు రీమేక్ లో చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. రౌడీ రాధోడ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు.

    English summary
    Akshay Kumar is likely to play the role that was essayed by Mahesh Babu in Dookudu film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X