ఇదే కావాలి!: అవార్డులు అవసరం లేదంటున్న హీరో

By Srinivas

తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కితే చాలునని, ఎలాంటి అవార్డులు, రివార్డులు అవసరం లేదని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అంటున్నాడు. ఇటీవలే ఆయన నటించిన స్పెషల్ 26 చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీనిపై ఆయన స్పందించాడు. ఇప్పటి వరకు తాను ఎన్నో సినిమాలను చేశానని, అన్నీ వాణిజ్య విలువలు ఉన్నవేనని ఆయన చెప్పాడు.

ఆ తరహా చిత్రాలకు తగ్గ హీరోగా తాను నిలబడినట్లు చెప్పాడు. అంతే తప్ప విమర్శకుల ప్రశంసల కోసం తాను ఏ చిత్రాన్ని చేయలేదన్నాడు. అయితే నటుడిగా ఎప్పటికి అప్పుడు తాను నేర్చుకుంటూనే ఉంటానన్నాడు. పరేష్ రావల్, అనుపమ్ ఖేర్ లాంటి వారితో నటించడం వల్ల తనకు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయని ఈ బాలీవుడ్ హీరో చెప్పాడు.

మరోవైపు స్పెషల్ 26 సినిమాలో నటనకు అక్షయ్ తన భార్య ట్వింకిల్ కన్నా నుండి పొగడ్తలు అందుకున్నాడు. 12 ఏళ్ల వారి వివాహ జీవితంలో అక్షయ్ నటన ట్వింకిల్‌ను మొదటిసారి బాగా ఆకట్టుకుందట. తమ పన్నెండేళ్ల వివాహ జీవితంలో ఇది మొదటిసారి అని చెప్పాడు.

కాగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన అక్షయ్ కుమార్ సౌత్ సినిమా స్టాండర్డ్స్‌పై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ...'సౌత్ సినిమాలపై నేను సీరియస్ గా దృష్టి పెడుతున్నాను. నా సినిమాల్లో చాలా వరకు సౌతిండియా దర్శకులు తీసిన సినిమాలకు రీమేకే. వారు చాలా ప్రతిభా వంతులు.

సౌతిండియా సినీ పరిశ్రమలో పని చేసిన వారు బాలీవుడ్ ఇంటస్ట్రీలో పని చేయడానికి ఆసక్తి చూపితే నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. నాకు రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఉంది, కానీ అది కుదురుతుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను' అంటూ అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X