»   » షాకింగ్: ఫ్యాన్ క్లబ్ చేతిలో మోసపోయిన స్టార్ హీరో!

షాకింగ్: ఫ్యాన్ క్లబ్ చేతిలో మోసపోయిన స్టార్ హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్......తన 'అభిమాన సంఘం' చేతిలో మోసపోయాడు. కొందరు వ్యక్తులు అక్షయ్ కుమార్ అభిమానులమనే పేరు చెప్పుకుని ఫ్యాన్ క్లబ్‌లో చేరి మోసాలకు పాల్పడ్డారు. దాని ద్వారా మోసాలకు పాల్పడ్డారు. అక్షయ్ కుమార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ, వాటి ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు ఫ్యాన్ క్లబ్‌కు చెందిన వ్యక్తులు అమాయకులను మోసం చేయడం మొదలు పెట్టారు. కొందరు అమాయకుల నుండి డబ్బు గుంజినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకుని అక్షయ్ కుమార్ షాకయ్యారు. ఈ చీటింగ్ కేసుపై అతను ఆగ్రహంగా ఉన్నాడు. తన నిజమైన అభిమానులకు ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు. 'ఇప్పుడే ఒక అప్‌సెట్ న్యూస్ విన్నాను. నా అభిమాన సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు నా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి కొందరి వద్ద డబ్బు తీసుకుని మోసం చేసినట్లు తెలిసింది' అన్నారు.

Akshay Kumar Got Cheated By His 'Fan Club'

'మీరు నిజంగా నా అభిమానులైతే నా స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. సక్సెస్‌కు షార్ట్ కట్ అనేది ఉండదు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా మోసగాళ్ల చేతిలో పెట్టి మోసపోకండి' అని అక్షయ్ కుమార్ తన రియల్ ఫ్యాన్స్‌కు సందేశం ఇస్తున్నారు. 'అభిమానం సంఘం ముసుగులో నిజమైన అభిమానులను మోసం చేస్తున్న వారికి తగిన శిక్ష తప్పదు' అని అక్షయ్ కుమార్ వెల్లడించారు.

English summary

 Akshay Kumar used to appear as an angry young man before a decade. Later, he switched to comedy and more lighter genres but now, the Khiladi actor is really an angry man because a certain 'fan club' duped many people by promising jobs in his production company and its offices.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu