అక్షయ్ కుమార్ హిందీ ‘దూకుడు’
దక్షిణాదిన హిట్టయిన సినిమాలను బాలీవుడ్ లో జోరుగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ అయితే వరుసగా దక్షిణాది సినిమాల్లో నటిస్తూ హిట్టమీద హిట్లు కొడుతున్నాడు. ఈ నేపథ్యంలో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా దక్షిణాది సినిమాలపై కన్నేశారు. తాజాగా తెలుగులో మహేష్ బాబు హీరోగా విడుదలైన 'దూకుడు" సినిమా మంచి హిట్ టాక్ తో ముందుకు సాగుతున్న నేపథ్యంలో.....ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకోవడానికి హీరో అక్షయ్ కుమార్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే గతంలో మహేష్ బాబు నటించిన 'పోకిరి" సినిమా రీమేక్ లో నటించి 'వాంటెడ్"గా హిట్ కొట్టిన సల్మాన్, దూకుడు హిట్టయితే దాన్ని కూడా దక్కించుకోవాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్, అక్షయ్ కుమార్ మధ్య పోటీ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు హిట్టయిన 'ఢీ", 'మర్యాద రామన్న" సినిమాల రీమేక్ లో నటించాలని మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఉవ్విల్లూరుతున్నారు. ఢీ సినిమాను గతంలో సల్మాన్ దక్కించుకోవాలని చూసినా అది రెడీ సినిమాకు కాస్త అటు ఇటూగా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇక పోతే దూకడు తమిళ రీమేక్ కోసం కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.


Click it and Unblock the Notifications











