మహేష్ హీరోయిన్ ను బకరా చేసిన స్టార్ హీరో
మహేష్ సరసన టక్కరి దొంగ చిత్రంలో హీరోయిన్ గా చేసిన బిపాసాను తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బకరా చేసారు. అదెలా జరిగిందంటే అక్షయ్ కుమార్ ఓ యాడ్ ఫిలిం షూటింగ్ నిమిత్తం ముంబై అవుట్ స్కర్ట్ లోని ఓ స్టూడియోకు వచ్చారు. అక్కడే బిపాసాబసు రాణా సరసన చేస్తున్న రోహన్ సిప్పీ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అక్షయ్ ఆమెకు మెయిల్ లో మెసేజ్ పెట్టారు. దాంతో బిపాసా అతన్ని పలకరించటానికి అతనున్న లొకేషన్ కి వెళ్ళింది. అయితే అక్కడ అతను కనపడలేదు. ఎవరిని అడిగినా వెయిట్ చెయ్యండి వచ్చేస్తారు అంటున్నారు. దాంతో దాదాపు అరగంటసేపు వెయిట్ చేసిన ఆమె బయిలుదేరబోతోంది. దాంతో అప్పటివరకూ ఆమెకు దగ్గరలో నిలబడి ఉన్న ఓ ముసలి వ్యక్తి దగ్గరకొచ్చి పలకరించారు. కానీ బిపాసా అతనే అక్షయ్ అని గుర్తుపట్టలేదు. చివరకు అక్షయ్ అసలు రూపం చూసి ఆమెను షాక్ చేసారు. ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











