బాలీవుడ్ స్టార్ హీరో నుంచి సుకుమార్ కు బంపరాఫర్.. పుష్ప చూసిన వెంటనే ఫోన్ చేసి మరీ..
మన దర్శకులు స్థాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అమాంతం పెరిగిపోతోంది. దర్శకధీరుడు రాజమౌళి క్రియేట్ చేసిన ఒక పాన్ ఇండియా మార్కెట్ ను ఇప్పుడు అందరూ చాలా పద్ధతిగా ఉపయోగించుకుంటున్నారు. మొత్తానికి దర్శకుడు సుకుమార్ కూడా తన స్థాయిని మరో లెవెల్ కు సెట్ చేసుకున్నాడు. సుకుమార్ ఒక కంప్లీట్ యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో పుష్ప సినిమా తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమా చూసిన తరువాత బాలీవుడ్ హీరో సుకుమార్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసే సినిమా చేద్దామని కూడా ఆఫర్ చేశాడట.

చేదు అనుభవాలు..
ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ అంతకు ముందు ఒక లెక్కల మాస్టారుగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఇక సినిమాలకు మొదట సహాయక దర్శకుడిగా అవకాశం కోసం చాలామంది దర్శకుల చుట్టూ కూడా అతను తిరిగాడు కానీ మొదట్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కనీసం చిన్న స్థాయి దర్శకులు ఎవరూ కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఫైనల్ గా దిల్ రాజు కాంపౌండ్ లో నేను సుకుమార్ ఒక మంచి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు.

మొదట్లోనే బిగ్ హిట్
అల్లు అర్జున్ ఆర్య సినిమా తర్వాత సుకుమార్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఆర్య సినిమాను తెరకెక్కించిన విధానం ఇండస్ట్రీలో అందరికీ చాలా బాగా నచ్చేసింది. అల్లు అర్జున్ తో అతనికి మంచి అనుబంధం కూడా ఏర్పడింది. అయితే వారి కలయికలో వచ్చిన రెండవ సినిమా ఆర్య 2 మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

రాజమౌళి అసూయ..
సుకుమార్ దర్శకత్వంకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. రాజమౌళి కూడా అతనికి ఫ్యాన్ అయిపోయాడు. మొదటిసారి సుకుమార్ ను చూసిన జక్కన్న తనకు వీడు ఎవడో పోటీగా వచ్చాడు అని డైరెక్ట్ గా సుకుమార్ కి చెప్పేంత అసూయ పెంచుకున్నాడట. ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చాలా సరదాగా వివరించాడు. సుకుమార్ తో స్నేహం చేసుకుంటే చాలా హ్యాపీ గా ఉండవచ్చు అని రాజమౌళి తెలియజేయడం విశేషం

బాలీవుడ్ లోనే బిగ్ హిట్
ఇక పుష్ప సినిమాతో దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని దర్శకుడు సుకుమార్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లుఅర్జున్ తో మూడోసారి చేసిన ఈ సినిమా సినిమా టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక బాలీవుడ్ అగ్ర దర్శకులు హీరోలు కూడా పుష్ప సినిమాను ఆకాశానికెత్తారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఆ సినిమా 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

అక్షయ్ కుమార్ ఫోన్ చేసి.. బంపరాఫర్
అయితే పుష్ప సినిమాను చూసిన బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా సుకుమార్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసిపోయింది. ఇటీవల ఆ విషయాన్ని సుకుమార్ ఓపెన్ గా తెలియజేశాడు. సినిమా చాలా అద్భుతంగా ఉంది అని మీతో సినిమా చేయాలని ఉందని కూడా అక్షయ్ కుమార్ కి ఫోన్ చేసి మరీ చెప్పడంతో సుకుమార్ తప్పకుండా చేద్దాం అని అన్నాడట ఇక భవిష్యత్తులో తప్పకుండా కాంబినేషన్లో ప్రాజెక్టు వస్తుందని ఈ దర్శకుడు వివరణ ఇచ్చేశాడు.


Click it and Unblock the Notifications











