రెండూ ఒకసారే రావు, నేనేమైనా పిచ్చోన్నా??: 2.0 రిలీజ్ పై ఇలా అన్నాడు

"2.0" లో కీలక పాత్ర చేసిన అక్షయ్‌కుమార్‌ దానికి పోటీగా తన సినిమా పద్మన్(pad man)ని జనవరిలో ఎందుకు విడుదల చేస్తాడు? ఇదే విషయాన్ని అక్షయ్‌ని అడిగితే... కళ్ళు తెరిపించే ఆన్సర్ అక్కడినుంచి వచ్చేసింది.

Recommended Video

Delay In Rajinikanth's 2.0 Realese ఓ క్లారిటీ ఇవ్వండి ప్లీజ్

శంకర్‌, రజనీకాంత్‌ల '2.0' రిలీజ్‌ డేట్‌పై ఇంతవరకు ఖచ్చితమైన క్లారిటీ లేదు. '2.0' రిలీజ్ విషయంలో మాత్రం ఆ విషయన్ని పట్టించుకోవటం లేదు. అసలు ఏ సమయం లో విడుదల అన్న విషయం లో ఆ చిత్ర నిర్మాతలు మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ముందు దీపావళి విడుదల అని చెప్పి.. ఆ తర్వాత జనవరి 25కు వాయిదా వేశారు నిర్మాతలు. ఆ డేట్ పక్కా అనుకుంటుండగా వారం కిందట ఈ చిత్రం వేసవికి వాయిదా పడిందని వార్తలొచ్చాయి.

 తమిళ సంవత్సరాది సందర్భంగా

తమిళ సంవత్సరాది సందర్భంగా

ఏప్రిల్ 13న తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా చెప్పుకున్నారు. అయితే ఈవిషయం మీద ఏరకమైన క్లారిటీ ఇవ్వకపోవటం తో ఈ సినిమా రిలీజ్ ని బట్టీ తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకున్న మిగతా నిర్మాతల్లోనూ గందరగోళం నెలకొంది.

థియేటర్లు ఖరారు చేసుకుంటున్నారు

థియేటర్లు ఖరారు చేసుకుంటున్నారు

అయితే స్పష్టమైన సమాచారం ఇంకా రాకముందే జనవరికే వస్తుందేమో అన్న ఆశతో 2.0కి జనవరి 25నుంచి థియేటర్లు ఖరారు చేసుకుంటున్నారు కొందరు డిస్ట్రిబ్యూటర్లు. భారీ సినిమాల మధ్య థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం వుంది కనుక బయ్యర్లు జాగ్రత్త పడుతున్నారు.

జనవరి 26న

జనవరి 26న "ప్యాడ్ మాన్" రిలీజ్‌

ఇదంతా బాగానే ఉంది. ఒక వేళ జనవరిలోనే తెస్తారేమో అనుకుంటూంటే ఇప్పుడు అక్షయ ఒక బాంబ్ పేల్చి మరీ తేల్చి చెప్పేసాడు 2.0 సంక్రాంతికి రావటం లేదని. ఆసక్తికర విషయం ఏమిటంటే, జనవరి 26న "పద్మన్ " (PADMAN) సినిమా రిలీజ్‌ చేస్తున్నానని అక్షయ్‌కుమార్‌ ప్రకటించాడు.

ఎందుకు విడుదల చేస్తాడు?

ఎందుకు విడుదల చేస్తాడు?

ఈ చిత్రానికి నిర్మాత కూడా అక్షయ్‌ కనుక ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. '2.0'లో కీలక పాత్ర చేసిన అక్షయ్‌కుమార్‌ దానికి పోటీగా తన సినిమా ఎందుకు విడుదల చేస్తాడు? ఇదే విషయాన్ని అక్షయ్‌ని అడిగితే ఇప్పుడు 2.0 అభిమానులకూ, ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న డిస్ట్రైబ్యూటర్లకూ కళ్ళు తెరిపించే ఆన్సర్ అక్కడినుంచి వచ్చేసింది.

పిచ్చితనం లేదు

పిచ్చితనం లేదు

తను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల చేసేంత పిచ్చితనం లేదని, రెండిట్లో ఒక సినిమానే అప్పుడు రిలీజ్‌ అవుతుందని చెప్పాడు. ఒకవేళ 2.0 రిలీజ్‌ అయితే కనుక "పద్మన్" (pad man) వాయిదా పడుతుందని అన్నాడు. కానీ దాదాపుగా ఆ పరిస్థితి రాకపోవచ్చు.

 ఏప్రిల్‌కి వాయిదా పడింది

ఏప్రిల్‌కి వాయిదా పడింది

కాకపోతే మనలాగా కాకుండా దాదాపుగా హిందీ సినిమాలకి రిలీజ్ డేట్ ఖచ్చితంగా పక్కా అయితేనే ముందుగా ప్రకటిస్తారు. హిందీ సినిమాలకి రిలీజ్‌ డేట్‌ ముందుగా ఫిక్స్‌ చేసేసుకోవాలి. 2.0పై ఎలాంటి న్యూస్‌ లేకుండా అక్షయ్‌ ఈ పని చేయడు కనుక ఈ చిత్రం ఏప్రిల్‌కి వాయిదా పడిందనేది ఫిక్స్‌ చేసేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X