»   » 2.0: రజనీకాంత్ కంటే అతనికే రెమ్యూనరేషన్ ఎక్కువ!

2.0: రజనీకాంత్ కంటే అతనికే రెమ్యూనరేషన్ ఎక్కువ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రోబో తర్వాత సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రం 2.0. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సాధారణంగా రజనీకాంత్ సినిమాలన్నీ కేవలం ఆయనకు ఉన్న స్టార్ ఇమేజ్ తోనే బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కొల్లగొడుతూ ఉంటాయి. అందుకే సినిమాకు పని చేసే వారిలో అందరికంటే రజనీకాంత్ రెమ్యూనరేషనే ఎక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్.. స్టార్ హీరోల సినిమాలందరి సినిమాల విషయంలో పరిస్థితి ఇలానే ఉంటుందనుకోండి.

robo

అయితే శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న 2.0 సినిమాలో మాత్రం రజనీకాంత్ పరిస్థితి అలా లేదట. ఇందులో రజనీకాంత్ కంటే అక్షయ్ కుమారే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అక్షయ్ కుమార్ తన వల్ల సినిమాకు జరిగే బిజినెస్ బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. లెక్కలు వేస్తే ఈ మొత్తం రజనీకి ఇచ్చే మొత్తం కంటే ఎక్కువే అయింది. అయితే బాలీవుడ్ మార్కెట్ అంతా కూడా అక్షయ్ కుమార్ వల్లనే జరుగుతుంది కాబట్టి నిర్మాతలు రజనీకాంత్ కంటే అతనికే రెమ్యూనరేషన్ ఎక్కువ ఫిక్స్ చేయక తప్పలేదట.

ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకేక్కుతోందన్న ప్రచారం పొందుతున్న ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సంచలనాలు నమోదు చేయడం మొదలుపెట్టింది. దాదాపు రూ.200 కోట్ల పై చిలుకు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కే శంక‌ర్ రూ.100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరున్న‌ ఏడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి ఈ సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నాయి.

English summary
Akshay Kumar Remuneration details For Robo 2.0 Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu