2.0: సంచలన విషయం లీక్ చేసిన శంకర్... ఆ ఇద్దరూ నో, ఆ తర్వాతే అక్షయ్ కుమార్!
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ '2.0' మరికొన్ని రోజుల్లో విడుదలవుతుండగా ఓ సంచలన విషయం వెల్లడైంది. తాజాగా ఓ తమిళ పత్రికతో శంకర్ మాట్లాడుతూ అక్షయ్ కుమార్ కంటే ముందు ఇద్దరు స్టార్లను ఇందులో విలన్ పాత్ర కోసం సంప్రదించారట.
శంకర్ గత చిత్రం 'ఐ' సినిమా ఆడియో లాంచ్‌కు చీఫ్ గెస్టుగా హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ హాజరయ్యారు. ఆ సమయంలోనే 2.0 సినిమా కోసం ఆయన్ను సంప్రదించినట్లు శంకర్ తెలిపారు. అయితే అది వర్కౌట్ కాలేదని తెలిపారు.

కమల్ హాసన్‌ను అడిగారు కానీ...
సినిమాలో ప్రతినాయకుడి పాత్ర అత్యంత కీలకమైంది కాబట్టి ఆ స్థాయికి తగిన నటుడి కోసం శంకర్ చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు కమల్ హాసన్‌ను కూడా అడిగారట. 2.0లో పూర్తి కథ విన్న కమల్ దీనికంటే ‘భారతీయుడు' సీక్వెల్ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపారట.

అలా అక్షయ్ కుమార్ లైన్లోకి
వాస్తవానికి లైకా ప్రొడక్షన్స్ వారు ‘కత్తి' చిత్రాన్ని బాలీవుడ్లో రీమక్ చేయడానికి అక్షయ్ కుమార్‌ను సంప్రదించారు. ఆ సమయంలో అక్షయ్‌కు శంకర్ 2.0 చిత్ర కథ చెప్పడంతో ఇంప్రెస్ అయిన ఆయన చేయడానికి ఓకే చెప్పారట.

చాలా మంది ఆ విషయం నమ్మలేదు
అక్షయ్ కుమార్ నెగెటివ్ రోల్ చేస్తున్నారంటే చాలా మంది నమ్మలేదు. కానీ ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉండటం వల్లనే ఆయన ఒప్పుకునప్నట్లు శంకర్ తెలిపారు. సినిమాలో రజనీకాంత్ పాత్రకు సమాంతరంగా అక్షయ్ కుమార్ రోల్ ఉంటుందని తెలిపారు.

గ్రాండ్ రిలీజ్
‘2.0' చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకు ఖర్చు పెట్టనంతగా రూ. 500 కోట్లకుపైగా ఈ సినిమాకు ఖర్చు చేశారు. 2.0 ట్రైలర్ నవంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











