టాక్ బాగుంది..కానీ కలెక్షన్స్ లేవు ఆవేదనతో సూపర్ స్టార్
పేరు... డబ్బులు రెండూ వస్తేనే విజయం సాధించినట్లు. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా అంటున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఆయన తాజా చిత్రం 'పాటియాలా హౌస్' చిన్న బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలై బాగుంది అని టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం ఆశించిన రీతిలో లేవు. ఈ విషయమై మాట్లాడుతూ ఇలా స్పందించారు. బడ్జెట్‌పరంగా పాటియాలా హౌస్ చిన్న సినిమానే కానీ... విషయం ఉన్న మంచి సినిమా . అయితే అనుకొన్న ఫలితం రాని మాట వాస్తవమే.ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన తక్కువగా ఉంది. ఈ కథ ఏ వర్గానికి నచ్చుతుందో ముందే వూహించడం కష్టం. మంచి సినిమా అందరూ మెచ్చుకొంటున్నారు. కానీ డబ్బులే రావడం లేదు. ఆ సినిమా కోసం ఖర్చుపెట్టింది కేవలం ఐదారు కోట్లే కావచ్చు. కానీ అవే వసూళ్ల రూపంలో సంపాదించుకోవడం కష్టమైపోతోంది అని భాదఫడ్డారు. ఇలాంటి సినిమాలు అమీర్ ఖాన్ మాత్రమే చేసి హిట్ కొట్టగలరు అన్నారు.


Click it and Unblock the Notifications











