ఏంటి అప్పుడే 'బంపర్ ఆఫర్' రీమేక్?
సాయిరామ్ శంకర్ హీరోగా వచ్చిన బంపర్ ఆఫర్ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ కోసం ఆపర్ వచ్చినట్లు గా పూరీ జగన్నాధ్ మీడియాకు చెప్పారు. బంపర్ ఆఫర్ సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని చెప్పారు. తనకు ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, అయితే ఆయన పేరు ప్రాజెక్టు కన్ఫర్మ్ కానిదే చెప్పనని చెప్పారు. అయితే అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో చేసే అవకాశం ఉందని అన్నారు. పోకిరి రీమేక్ వాంటెడ్ కథా రచయితగా బాలీవుడ్ లో పాపులర్ అవటంతో ఈ ఆఫర్ వచ్చి ఉండే అవకాశం ఉందని కొందరనుకున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఎమ్.ఎస్.రాజు వంటి నిర్మాతలు సైతం తమ మస్కా చిత్రాన్ని అక్షయ్ కుమార్ తో చేయనున్నట్లు చెప్పటాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఏక్ నిరంజన్ చిత్రం రిలీజ్ కాకముందే అభిషేక్ రీమేక్ చేస్తున్నానని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వూలో చెప్పారు పూరీ. ఇంతకు ముందు కూడా నేనింతే చిత్రాన్ని బాలీవుడ్ వారు మంచి రేటిచ్చి కొంటున్నారని పూరి చెప్పటం తెలిసిందే. ఇది పబ్లిసిటీ జిమ్మిక్కా లేక నిజంగానే రీమేక్ కానుందా తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











