ఎట్టకేలకు ఇలియానాకు స్టార్ హీరోతో సెట్టయింది
హైదరాబాద్: సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా తర్వాత బాలీవుడ్ బాట పట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె చేసిన తొలి సినిమా ‘బర్ఫీ' మంచి విజయం సాధించినప్పటికీ అమ్మడి కెరీర్ మాత్రం అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదు.
బర్ఫీ తర్వాత ఆమె చేసిన బలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. సౌత్ లో ఉన్నప్పుడు చేతి నిండా సినిమాలుండేవి. సంవత్సరానికి నాలుగు సినిమాలకు తగ్గకుండా చేసే ఇలియానా..... బాలీవుడ్లో అడుగు పెట్టిన నాలుగేళ్లలో నాలుగు సినిమాలకు మించి చేయలేదంటే ఆమెక అవకాశాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2015లో ఇలియానా ఒక సినిమా కూడా చేయలేదు.

బాలీవుడ్లో ఇలియానా కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగక పోవడంతో..... అమ్ముడు సౌత్ సినిమాల వైపు ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం లేక పోయింది. అవకాశాలు లేక ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో ఇలియానా ఎట్టకేలకు స్టార్ హీరోతో సినిమా సెట్టయింది. ఆమెను పిలిచి మరీ అవకాశం ఇచ్చాడట అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘రుస్తుం' సినిమాలో ఇలియానాను హీరోయిన్ గా సెలక్ట్ చేసారు.
ఈ చిత్రంలో ఇలియానాతో పాటు ఇషా గుప్తా కూడా అవకాశం దక్కించుకుంది. టిను దేశాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిల్ అంబానీతో పాటు నీరజ్ పాండే, వీరేంద్ర అరోరా, అర్జున ఎన్ కపూర్ నిర్మాతలుగా ఉన్నారు. థ్రిల్లర్ కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











