twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళితో చేయాలని మరో బాలీవుడ్ స్టార్ తహతహ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన తాజా సినిమా 'కిలాడీ 786' షూటింగులో బిజీగా గడుపుతున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన అక్షయ్ కుమార్ ఇక్కడ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నాడు. ఈచిత్రం భిన్నంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

    ఈ సందర్భంగా సౌత్ సినిమా స్టాండర్డ్స్‌పై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు అక్షయ్ కుమార్ స్పందిస్తూ...'సౌత్ సినిమాలపై నేను సీరియస్ గా దృష్టి పెడుతున్నాను. నా సినిమాల్లో చాలా వరకు సౌతిండియా దర్శకులు తీసిన సినిమాలకు రీమేకే. వారు చాలా ప్రతిభా వంతులు. సౌతిండియా సినీ పరిశ్రమలో పని చేసిన వారు బాలీవుడ్ ఇంటస్ట్రీలో పని చేయడానికి ఆసక్తి చూపితే నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. నాకు రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఉంది, కానీ అది కుదురుతుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను' అంటూ అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

    అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ లో నటించబోతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్టయిన 'తుపాకి' చిత్ర రీమేకులో చేయబోతున్నాడు. కథాపరంగా ఇది ముంబయిలో జరిగే అంశం కావడంతో హీరో అక్షయ్‌కుమార్‌ హిందీలో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విపుల్‌షా నిర్మాతగా తెరకెక్కనుంది. మురగదాస్ దర్సకత్వం వహిస్తారు.

    ఇక ఈ చిత్రంలో అక్షయ్‌కు జంటగా ప్రణీత చోప్రా కనిపించనున్నారు. మురుగదాస్‌ మొదట ఈ కథను అక్షయ్‌కే చెప్పారు. ఆయన పలు చిత్రాల్లో బిజీగా ఉండటంతో నటించలేకపోయారు. ఇప్పుడు రెండు భాషల్లోనూ విజయం వరించడంతో అక్షయ్‌ మరింత ఉత్సాహం చూపుతున్నారు.

    English summary
    "I am seriously considering the option to do a South film. Half of my films are dealt by South Indian directors. They are perfectionists and can complete a film in 60 days of time. I personally recommend the new persons joining the industry to brush up their skills by working in few South films. I have a wish to work with Rajamouli but I don't know, when will it be fulfilled." Akshay Kumar told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X