ఆడపిల్లకు జన్మనిచ్చిన అక్షయ్ భార్య ట్వింకిల్
అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'ఓ మై గాడ్' చిత్రం ప్రమోషన్ ఈ వెంట్లలో బిజీగా గడుపుతున్నాడు. బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం ట్వింకిల్ డెలివరీ విషయం తీసుకున్న అక్షయ్ కుమార్ లాస్ట్ నైట్ జైపూర్ నుంచి ముంబై బయల్దేరి ప్రసవం సమయంలో ట్వింకిల్ పక్కనే ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో ట్వింకిల్ డెలివరీ అయింది. ఇది నార్మల్ డెలివీర అని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ట్వింకిల్ ఖన్నా ఇటీవల మరణించిన బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పెద్ద కూతురు. ర్తె ట్వింకిల్ ఖన్నా, నటుడు అక్షయ్ కుమార్ ని వివాహమాడినది. జనవరి 14, 2001న వివాహం జరిగింది. వారి కుమారుడు ఆరవ్ సెప్టెంబర్ 15, 2002న జన్మించాడు.
అక్షయ్, ట్వింకిల్ లాక్మే ఫాషన్ వీక్లో వివాదాస్పద చర్యకు పాల్పడ్డారు. ఈ ఫ్యాసన్ షోలో ట్వింకిల్ తన భర్త అక్షయ్ జీన్స్ బటన్ తీయడం వివాదాస్పదం అయింది. ఈ మేరకు ఏప్రిల్ 2009లో అక్షయ్ కుమార్ మరియు ట్వింకిల్ ఖన్నాలకు వ్యతిరేకంగా వకోల పోలీసులచే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 294 ప్రకారం FIR దాఖలుచేయబడింది.


Click it and Unblock the Notifications












