మార్షల్ ఆర్ట్స్: మోడీకి అక్షయ్ కుమార్ సూచన
ముంబై: తమను తాము కాపాడుకోవడం ఎలాగో పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు నేర్పించాలని, విద్యలో మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిని భాగం చేయాలని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కొత్త ప్రధాని నరేంద్ర మెడీకి విన్నవించారు. ఆదిత్య థాకరేతో కలిసి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన అక్షయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసారు.
మహిళలు, పిల్లలు ఆత్మరక్షణ విషయంలో ట్రైనింగ్ తీసుకోవడం ఎంతో అవసరమని, పాఠశాలలో 4 సంవత్సరాల సెల్ఫ్ డిఫెన్స్ ఫ్రొగ్రాం ప్రవేశ పెట్టాలని, సబ్జెక్టులో దీన్ని ఒక భాగం చేయాలని ఆయన సూచించారు. ప్రతి పౌరుడు ఆత్మరక్షణ విషయంలో శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.

అక్షయ్ కుమార్ సినిమాల విషయానికొస్తే.....ఆయన నటించిన 'హాలీడే' చిత్రం ఈ రోజు విడుదలైంది. తమిళ సూపర్ హిట్ మూవీ 'తుపాకి' రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన సోనాక్షి సిన్హా నటించింది. ఈ రోజు విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
'హాలీడే' చిత్రంలో అక్షయ్ కుమార్ ఒక ఆర్మీ సోల్జర్ పాత్రలో నటించారు. తమిళంలో దర్శకత్వం వహించిన ఏఆర్ మురుగదాస్ హిందీలో కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











