twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి టైటిల్ తో అక్షయ్ కుమార్ చిత్రం

    By Srikanya
    |

    చిరంజీవితో తెలుగులో సూపర్ హిట్ చిత్రం ఖైదీ నెంబర్ 786. ఇప్పుడదే టైటిల్ తో అక్షయ్ కుమార్ ఓ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. హిమ్మేశ్ రేష్మియా నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ కామిడీ సినిమా.అయితే ఈ చిత్రానికి ఓ ట్యాగ్ లైన్ ఉంటుంది. అది మేడిన్ ఇన్ పంజాబ్. సింగ్ ఈజ్ కింగ్ టైటిల్ తో గతంలో పంజాబీయుల అబిమానాన్నే కాక అందరి ప్రశంసలు అందుకోవటంతో ఇప్పుడీ పంజాబ్ అనేది ట్యాగ్ గా పెట్టారు.

    ఇక ఈ చిత్రంలో అక్షయ్ తో పాటు హిమ్మేష్ రేష్మియా కూడా నటించనున్నారు. హిమ్మేష్ ఓ గుజరాతి కుర్రాడిగా కనపిస్తారు.వచ్చే ధీపావళి కి విడదల అయ్యేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.హిమ్మేష్ రేష్మియా ఈ చిత్రానికి సంగీతం సైతం అందిస్తారు. ఈ సినిమా తన బ్రైన్ చైల్డ్ గా హిమ్మేష్ అభివర్ణిస్తున్నాడు. అక్షయ్ కుమార్ గతంలో ఖిలాడీ టైటిల్ తో చాలా సినిమాలు చేసి ఉండటంతో ఈ సినిమాని వెంటనే ఓకే చేసేసారు. ఇక అక్షయ్ కుమార్ ప్రస్తుతం విక్రమార్కుడు రీమేక్ లో చేస్తున్నారు.రవితేజ,రాజమౌళి కాంబినేషన్ లో విడుదలైన విక్రమార్కుడు తెలుగులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆ చిత్రాన్ని ప్రభుదేవా డైరక్ట్ చేస్తున్నారు.

    ఈ చిత్రం మొన్నీ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది. ఇప్పుడు హిందీలో రీమేక్ అవటానకి రెడీ అవుతోంది. రౌడీ రాధోడ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేయనుంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా కసరత్తులు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.

    English summary
    Akshay Kumar has tied up with Himesh Reshammiya to produce a comedy film titled Khiladi 786-Made In Punjab.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X