For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇద్దరినీ కప్ బోర్డ్‌లో దాచేసా, అదే అయ్యింది: అసిన్ పాపతో ఫోజ్ ఇచ్చిన బాలీవుడ్ హీరో

  |

  అసిన్ టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్ భామ సౌత్ లో ఉన్న ఆఫర్లనీ, కెరీర్ ని కాలదన్నుకొనిన్ బాలీవుడ్ లో జండా పాతాలని వెళ్ళింది. ఆరభం బాగానే జరిగి సల్మాన్ ఖాన్ తో చేసిన రెడీ మంచి ఫలితాన్నే ఇచ్చింది. అసిన్ ఆ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ అనిపించుకుంది కానీ పాపం ఆత్రవాతే పెద్ద అవకాశాలేమీ రాలేదు, ఒకటీ అరావచ్చినా అవి ఆమె కెరీర్ కి ఏమాత్రం ప్లస్ అవలేదు. దాంతో మళ్ళీ సౌత్ కి రాలేకా బాలీవుడ్ లో అవకాశాలు లేకా కెరీర్ కి మంగళం పాడేసుకుంది.అయితే అక్కడ ఆమెకి ఇంకో ప్లస్ ఏమిటంటే ఆమె భర్త రాహుల్ పరిచయం బాలీవుడ్ లోనే జరిగింది...

   బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

  బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

  ఇండియన్ సెల్‌ఫోన్ రంగం లో చిరపరిచితం అయిన మైక్రో మ్యాక్స్ అధినేత అయిన రాహుల్ తో పరిచయం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తోనే జరిగింది. అదేలా అన్నది అక్షయ్ స్వయంగా అసిన్, రాహుల్ ల పెళ్ళి సమయం లోనే చెప్పాడు. వారిమధ్య ప్రేమ చిగురించింది ఇప్పుడు కాదు. నాలుగేళ్ల క్రితమే పుట్టింది.

   దాగుడుమూతలు ఆడుతూ

  దాగుడుమూతలు ఆడుతూ

  వారిని కలపడంలో నాతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాత్ర కూడా ఉంది. ఐతే ఈ విషయం ఆమెకే తెలియదు. వారిని ఎలా కలిపానంటే... చెప్తే మీరు నవ్వకూడదు మరి. హౌస్ ఫుల్ 2 చిత్రం చేస్తున్న సమయం అది. షూటింగ్ కోసం ఢిల్లీకి వెళ్లాము. కాస్త ఖాళీ సమయం దొరికింది. దాగుడుమూతలు ఆడుదామని డిసైడ్ చేసుకున్నాం.

   ఇంకేమవుతుంది... అదే అయ్యింది.

  ఇంకేమవుతుంది... అదే అయ్యింది.

  అలా ఆడుతూ ఆడుతూ... అసిన్, రాహుల్ ఇద్దరూ ఒకే కప్ బోర్డులో దాక్కునేట్లు చేసేశా. ఇద్దరూ కలిసి ఒకే కప్ బోర్డులో దాక్కుంటే ఇంకేమవుతుంది... అదే అయ్యింది. వారిరువురు పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటూ అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు. అలా ఆ రోజు వాళ్ళిద్దరినీ కలిపాడు కాబట్టే ఆ ఇద్దరికీ అక్షయ్ ఇప్పుడు ఆప్తుడయ్యాడు...

  ఆడబిడ్డకు జన్మనిచ్చింది

  ఆడబిడ్డకు జన్మనిచ్చింది

  గతేడాది జనవరిలో రాహుల్ శర్మను పెళ్లాడిన అసిన్.. మంగళవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అసలు ఆమె గర్భవతి అన్న విశయం కూదా బయటకి పొక్కనివ్వకుండా ఇలా అందర్నీ సర్పైజ్ చేసింది.ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

   పాపని ఎత్తుకొని ఫొటోకి ఫోజ్ ఇచ్చేసాడు

  పాపని ఎత్తుకొని ఫొటోకి ఫోజ్ ఇచ్చేసాడు

  ‘ఈరోజు మాకు ఏంజిల్‌ లాంటి ఆడపిల్ల పుట్టిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని అసిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. అయితే పెళ్ళికి కారణమైన అక్షయ్ పాప కోసం రాకుండా ఎలా ఉంటాడు? తల్లితండ్రులకంటే ముందు తానే పాపని ఎత్తుకొని ఫొటోకి ఫోజ్ ఇచ్చేసాడు.

   అసిన్ పాపను ఎత్తుకొని

  అసిన్ పాపను ఎత్తుకొని

  తాజాగా అక్షయ్‌కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఫోటో వైరల్ అవుతోంది. ఆసుపత్రిలో అసిన్ పాపను ఎత్తుకొని తీసుకున్న ఫొటోను అక్షయ్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పెట్టాడు. ‘దేనితోనూ పోల్చలేని ఒక జాయ్.. లిటిల్ ఏంజెల్‌ను పొందిన నా సన్నిహిత స్నేహితులు అసిన్, రాహుల్‌శర్మకు శుభాకాంక్షలు' అని అక్షయ్ తన ట్వీట్‌లో రాశాడు.

  English summary
  Actor Akshay Kumar shared the first picture of Asin Thottumkal and Rahul Sharma's daughter, who was born on Tuesday. He is seen cradling the baby in his arms, with a big smile on his face.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X