'నేనేంటో నిరూపిస్తా!' : తమన్నా
'హిమ్మత్‌వాలా' నిర్మాణంలో ఉన్నప్పుడు తమన్నాను మరో శ్రీదేవిగా అభివర్ణించిన బాలీవుడ్ మీడియా.సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ రాగానే తమన్నాపై విమర్శలు గుప్పించింది. అయితే, తమన్నా 'హిమ్మత్‌వాలా' ఫ్లాప్ తర్వాత కూడా ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గలేదు.
ప్రస్తుతం ఆమె అక్షయ్‌కుమార్‌కు జోడీగా సాజిద్ ఫర్హద్ దర్శకత్వంలో 'ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్' చిత్రంలో నటిస్తున్నారు. విశేషమేంటంటే.. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుంది. 'హిమ్మత్‌వాలా' విడుదలైన తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించడంతో 'ఫ్లాప్' ఖాయం అంటూ బాలీవుడ్ మీడియాలో మళ్లీ కథనాలు ఊపందుకున్నాయి.
తమన్నా స్పందిస్తూ -'''హిమ్మత్‌వాలా' డేట్‌లోనే 'ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్' విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఏ రోజైతే నా బాలీవుడ్ కలలపై నీళ్లు చల్లిందో, అదే రోజున నేను అనుకున్నది సాధించబోతుండటం నా లైఫ్‌లో మరిచిపోలేని జ్ఞాపకం. అందరి అభిప్రాయాలను తారుమారు చేసి ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం'' అని నమ్మకం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications












