twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్స్ కేసు డీల్ చేసిన ఆఫీసర్ రంగంలోకి దిగాడు.. సినిమా హాల్స్ ఆటలు ఇక సాగవు!

    |

    గత ఏడాది వెలుగు చూసిన టాలీవుడ్ డ్రగ్స్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసుని ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ ఈ కేసుని డీల్ చేశారు. ఈ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న సెలెబ్రిటీలందరిని అకున్ సబర్వాల్ విచారణ జరిగిపిన సంగతి తెలిసిందే. తాజగా అకున్ సబర్వాల్ మరో బాధ్యతని స్వీకరించారు. సినిమా థియేటర్స్, మల్టి ఫ్లెక్స్ లలో విక్రయించే ఆహార పదార్థాలని అధిక ధరలకు అమ్ముకుంటున్న సంగతి తెలిసిందే.

    అకున్ సబర్వాల్ ఈ అక్రమాలపై తాజగా ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ పరిధిలోని ప్రముఖ థియేటర్స్, మల్టి ఫ్లెక్స్ లలో ఆయన దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో దాదాపు 100 వరకు కేసులు నమోదయ్యాయి. ఎంఆర్పీ ధరకు మించి ఒక్కరూపాయి అధికంగా వాసులు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

     Akun Sabharwal raids on Hyderabad movie theaters

    హైదరాబాద్ లోని జివికె వన్, ప్రసాద్ ఐమాక్స్, కార్నివాల్ అమీర్ పేట్, పివిఆర్ పంజా గుట్ట వంటి ప్రధాన మల్టి ప్లెక్స్ లలో తనిఖీలు నిర్వహించారు. సినిమా థియేటర్ యాజమాన్యాలు మోసాలు చేసినా, అధిక ధరలకు విక్రయించినా ప్రజలు 7330774444 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అకున్ సబర్వాల్ కోరారు.

    English summary
    Akun Sabharwal raids on Hyderabad movie theaters. Files over 100 cases
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X