Amala Paul అలా మోసం చేసింది.. నా కొడుకు జీవితం సర్వనాశనం: విడాకులపై విజయ్ తండ్రి

దక్షిణాది సినీ ప్రముఖులు అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్ పెళ్లి వార్త ఎంత సంచలనం రేపిందో.. వారు తమ దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పడం కూడా అంతే సంచలనం రేపింది. వారిద్దరి విడిపోయి ఎవరికి వారు సుఖంగా ఉంటున్నా వారి పెళ్లి, విడాకుల వెనుక విషయాలు మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటాయి. అమలాపాల్‌తో తన కొడుకు విడిపోవడానికి అసలు కారణాన్ని విజయ్ తండ్రి బయటపెట్టారు.. అదేమిటంటే..

అమలాపాల్, విజయ్ ప్రేమలో..

అమలాపాల్, విజయ్ ప్రేమలో..

సినీ పరిశ్రమలో నటిగా అమలాపాల్, దర్శకుడిగా ఏఎల్ విజయ్ తమ అదృష్టాలు పరీక్షించుకొంటున్న సమయంలో వారిద్దరు దైవా తురమగల్ అనే షూటింగ్‌లో కలుసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. అనంతరం తమ రిలేషన్‌కు వివాహంతో ముడిపెట్టేందుకు నిర్ణయం తీసుకొన్నారు.

మతాలు వేరైనా.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్

మతాలు వేరైనా.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్

అమలాపాల్, ఏఎల్ విజయ్ భిన్న మతాలకు చెందిన వారు కావడంతో ఇరు కుటుంబాలు కొంత అభ్యంతరం లేవనెత్తాయి. అయితే అమలా, విజయ్ తమ కుటుంబాలను ఒప్పించి పెళ్లికి ఒప్పించారు. దాంతో వారి పెళ్లి ఇరు కుటుంబాల సమ్మతితో 2015లో జరిగింది. ఆ తర్వాతనే అమలాపాల్ అసలు రూపం బయటపడిందని విజయ్ తండ్రి అజగప్పన్ మీడియాతో అన్నారు.

మాట తప్పిన అమలాపాల్

మాట తప్పిన అమలాపాల్

పెళ్లికి ముందు యాక్టింగ్‌కు దూరంగా ఉంటానని మాతో చెప్పింది. కానీ పెళ్లైన కొద్దిరోజులకే సూర్యతో పసంగ 2, వడా చెన్నై సినిమాలను ఒప్పుకొన్నది. అయితే ఆమె సినిమాల్లోకి వెళ్లడం విజయ్‌కి ఇష్టం లేకుండే. దాంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి అని విజయ్ తండ్రి అజగప్పన్ చెప్పారు.

ఫ్యామిలీని ఎదిరించిన అమలాపాల్

ఫ్యామిలీని ఎదిరించిన అమలాపాల్

ఇక అమలాపాల్‌ను సినిమాలు చేయకుండా ఒప్పించడానికి రెండు కుటుంబాలు ప్రయత్నించాయి. అమల తల్లిదండ్రులు చెప్పిన మాటలను కూడా పట్టించుకోలేదు. దాంతో నా కొడుకు జీవితం అల్లకల్లోలంగా మారింది. మనశాంతి కరువైంది. దాంతో నా కొడుకు ఆరోగ్యాన్ని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తీవ్రమైన నిర్ణయాలు తీసుకొన్నాం అని విజయ్ తండ్రి విడాకులు వెనుక అసలు కారణం చెప్పారు.

Recommended Video

Akkineni Akhil Message To His Fans On His Birthday
ప్రస్తుతం ఏఎల్ విజయ్, అమలాపాల్ జీవితాలు..

ప్రస్తుతం ఏఎల్ విజయ్, అమలాపాల్ జీవితాలు..

అమలాపాల్, విజయ్ పరస్పర అంగీకారం మేరకు 2017లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత విజయ్ పెళ్లి చెన్నైకి చెందిన డాక్టర్ మన్నివక్కమ్‌తో జరిగింది. తన తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకొని విజయ్ ప్రస్తుతం తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల గాయకుడు భవిందర్ సింగ్‌తో అమలాపాల్ అఫైర్ పెట్టుకొన్నట్టు వార్తలు వచ్చాయి. పెళ్లి చేసుకొన్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X