కానీ 125 రోజులకే సరిపెట్టుకుంటున్నా:‘అలా..మొదలైంది’ నందినీరెడ్డి
125నుండి 175 రోజులకు కూడా వెళ్లాలనుకున్నాం. కానీ 125 రోజులకే సరిపెట్టుకుంటున్నాం. నా చిత్రం వందరోజులు ప్రదర్శించబడాలన్నది ఓ బుజ్జి కల. ఆ కల మొదటి చిత్రంతోనే నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది నందీని రెడ్డి. ఆమె పరిచయ చిత్రం 'అలా.. మొదలైంది"హిట్ టాక్ తో దూసుకుపోతూండటంతో ఈ చిత్రానికి సంబంధించిన 75రోజుల వేడుకను హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రదర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ ఇలా స్పందించింది.
అలాగే 'పదిరోజులనుండి మా అంచనాలు వందరోజులకు వెళ్లడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో మాకు వెన్నంటి ప్రోత్సహించిన మీడియా పాత్ర కూడా చిన్నది కాదు. అందుకే మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ చిత్ర విజయానికి తోడ్పడిన అందరికీ చాలా పెద్ద థాంక్స్" అంది.నాని, నిత్యమీనన్ జంటగా రంజిత్ మూవీస్ పతాకంపై నందినీరెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











