విధి కలిపిన ప్రేమ జంట కథ(అలా మొదలైంది ప్రివ్యూ)

By Srikanya

ప్రేమపై తనకంటూ స్పష్టమైన అభిప్రాయాలు కలిగిన కుర్రాడు గౌతమ్‌ (నాని). అతను ఓ టీవీ ఛానల్ ‌లో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా పని చేస్తుంటాడు. నిత్య (నిత్య మీనన్‌) చాలా ఉన్నతమైన భావాల కల నేటి తరం అమ్మాయి. ఆమె ఓ సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ ఇతరులకు సహాయపడుతుంటుంది. వీరిద్దరూ మంచి స్నేహితులుగాప్రెండ్స్ మారతారు. ఈ లోగా అనుకోని పరిస్ధితుల్లో కావ్య (స్నేహ ఉల్లాల్‌), సిమ్రాన్‌(కృతి) గౌతమ్‌ జీవితంలోకి ప్రవేశిస్తారు. దాంతో నిత్య అతన్ని దూరం పెడుతుంది. ఈ ప్రేమ జంటకు విధి చేసిన మేలేమిటన్నదే ఈ చిత్ర కథ.

ఇక ఈ చిత్రం గురించి నందిని రెడ్డి మాట్లాడుతూ...ఇది ఓ రొమాంటిక్ డ్రామా జనర్ కి చెందిన చిత్రం. అయితే నేరేషన్ మాత్రం ఓ నావెల్ గా ఉంటుంది. ఇది ఓ ఇద్దరు యంగస్టర్స్ మధ్య జరిగే కథ. ఓఅమ్మాయి, అబ్బాయి ఓ క్రాస్ వద్ద మీటవుతారు. అక్కడ నుండి వారి జీవితాల్లో మార్పులు ఎలా చోటు చేసుకున్నాయి. ఎలా వాళ్ళిద్దరూ తమ గోల్స్ ని నెరవేర్చుకుని ఒకటి అయ్యారు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణవంశీ వద్ద అసోశియోట్ గా చేసిన నందినీ రెడ్డి దర్శకురాలుగా పరిచయం అవతోంది. ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతుంది.

సంస్థ: శ్రీ రంజిత్‌ మూవీస్‌
నటీనటులు: నాని, నిత్యమీనన్‌, స్నేహ ఉల్లాల్‌, కృతి కర్బందా, ఆశిష్‌ విద్యార్థి, రోహిణి, ప్రగతి, ఉప్పలపాటి నారాయణరావు తదితరులు సంగీతం: కల్యాణిమాలిక్‌
నిర్మాత: కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌
దర్శకత్వం: బి.వి.నందిని రెడ్డి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X