సరిగ్గా వాడుకోవాలని నందినిరెడ్డికి ఉచిత సలహాలు!

By Bojja Kumar

హైదరాబాద్: 'అలా మొదలైంది' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందినీరెడ్డి. నందినీరెడ్డి త్వరలో 'అలా మొదలైంది' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఓ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఆమెను సంప్రదించడం, బాలీవుడ్లో ఆ చిత్రాన్ని రీమేక్ చేయడానికి నందినీరెడ్డి అంగీకరించడం కూడా జరిగి పోయింది. నందినీరెడ్డికి బాలీవుడ్ అవకాశం వచ్చిందని తెలియగానే పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పట్టారట.

Ala Modalaindi in Hindi

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లి నిలదొక్కుకున్న మహిళా దర్శకులు చాలా అరుదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగు చిత్ర సీమకు పేరు తేవాలని పలువురు సూచిస్తున్నారు.

అక్కడ ఓ పెద్ద నిర్మాణ సంస్ధతో కలిసి దామోదర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒరిజనల్ లో నటించిన నిత్యా మీనన్ కూడా ఈ చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. హీరోగా ఓ కొత్త కుర్రాడు నటించే అవాశమున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు హిట్ అయితే హిందీలో వరస సినిమాలు చేయాలనే ఆలోచనలో నందినీ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీకి తగినట్లు చిన్న చిన్న మార్పులతో ఈ స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X