'అలా మొదలైంది' నిర్మాతకి మడతకాజా తినిపిస్తున్న అల్లరి నరేష్
అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తొలి చిత్రంతోనే విజయం సాధించారు.దాంతో ఆ ఉత్సాహాన్ని పురస్కరించుకుని ఆయన తదుపరి చిత్రాన్ని అల్లరి నరేష్ తో నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అల్లూరి సీతారామరాజు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సుకుమార్, భాస్కర్ వంటి దర్శకులతో కలిసి ఎడిటర్ మోహన్ దగ్గర పరిచయం చేసాడు సీతారామరాజు. ఇక ఈ దర్శకుడు చెప్పిన లైన్ విన్న నిర్మాత వెంటనే ఓకే చేసారు. ఇక ఈ చిత్రానికి టైటిల్ మడతకాజా అని ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో నరేష్...బ్లఫ్ మాస్టర్ తరహాలో వుండే పాత్రను చేయనున్నాడని తెలిసింది. మరో ప్రక్క నరేష్ హీరోగా...వీరభధ్రంని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందిన అహనా పెళ్ళంట చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
అల్లరి నరేష్ అహనా పెళ్ళంట మడతకాజా కత్తి కాంతారావు allari naresh ahana pellanta madatha kaja katti kantha rao


Click it and Unblock the Notifications