'అలా మొదలైంది' ప్రమోషన్ లో నాని బిజీ
'అలా మొదలైంది' చిత్రం రిలీజై చాలా రోజులు అయింది కదా ఇంకా ప్రమోషన్ ఏమిటా అని ఆశ్చర్యపోకండి. అలా మొదలైంది చిత్రాన్ని ఇప్పుడు మళయాళంలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దాంతో చిత్రం హీరో నాని కొద్ది రోజులుగా కేరళలలో మకాం వేసి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. నిత్యామీనన్ ఎలాగో మళయాళీనే కాబట్టి అక్కడి వారికి పరిచయమే.అంగే తుడంగి టైటిల్ తో రిలీజ్ అయ్యే ఈ చిత్రం అక్కడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్కడ రిలీజ్ జూలై 22వ తేది.
ఇక కేరళలో ప్రమోట్ చేసి వచ్చిన నాని మాట్లాడుతూ...నా సినిమా మళయాళంలో విడుదల అవటం ఆనందంగా ఉంది. అక్కడా ఘన విజయం సాధిస్తుందని,తెలుగులాగానే హిట్టువతుందని భావిస్తున్నాను అన్నారు. నందినీరెడ్డి మూడు కోట్లతో తీసిన ఈ చిత్రం సంక్రాంతికి తర్వాత విడుదలై దాదాపు పన్నెండు కోట్లు సంపాదించి సంక్రాంతికి విడుదలైన చిత్రాలు అన్నిటికన్నా బెస్ట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత నానికి సైతం మంచి క్రేజ్ వచ్చింది.అతను ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఈగ చిత్రం చేస్తున్నారు. అలాగే నాని, నిత్యా మీనన్ కాంబినేషన్ లో రూపొందిన సెగ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











