అందరికీ ఓ టైమ్ వస్తుంది.. అది ఎంత తొందరగా జరిగితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు: అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం సక్సెస్ జోష్‌లో ఉన్నారు. 2020 ఆరంభంలోనే 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ సాధించి సంక్రాంతి విన్నర్‌గా నిలిచారు బన్నీ. ఈ సక్సెస్ జోష్‌లో ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన యూనిట్.. ఇప్పుడు థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. వివరాల్లోకి పోతే..

బన్నీ స్పీచ్.. స్పెషల్ అట్రాక్షన్‌

బన్నీ స్పీచ్.. స్పెషల్ అట్రాక్షన్‌

ముందుగా ‘అల వైకుంఠపురములో' సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు అంటూ స్పీచ్ ప్రారంభించిన స్టైలిష్ స్టార్.. ఈ థ్యాంక్స్ మీట్ ఎందుకు పెట్టారు? తన రికార్డ్స్ గురించి మాట్లాడుతూ అందరి చేత అభినందనలు అందుకున్నారు. బన్నీ స్పీచ్ ఈ మీట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మా గురించి పట్టించుకోరా? అనే అడిగేవారు

మా గురించి పట్టించుకోరా? అనే అడిగేవారు

''మా దగ్గర ప్రొడక్షన్ కంపెనీతో పాటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసేవాళ్లు ఎప్పుడూ నన్ను ఓ మాట అడుగుతూ ఉండేవారు. ఏంటండీ ఎప్పుడు సినిమా హిట్ అయినా మీరు మీ టీం మాత్రమే సక్సెస్ మీట్స్ చేసుకుంటారు. మా గురించి పట్టించుకోరా? మాకు షీల్డ్ ఇచ్చి సత్కరించరా? అనేవారు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్ ఇచ్చి సత్కరించేంత గొప్పగా నా సినిమా ఆడినప్పుడు తప్పకుండా ఫంక్షన్ చేస్తాను అని వాళ్లకు మాటిచ్చా'' అని బన్నీ చెప్పాడు.

ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో.. అప్పుడే ఇండస్ట్రీ

ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో.. అప్పుడే ఇండస్ట్రీ

''ఇప్పుడు ‘అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాం. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డులను ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. కాబట్టి నా రికార్డును మరెవరైనా బ్రేక్ చేయాలని ఆశిస్తున్నా'' అని అల్లు అర్జున్ తెలిపారు.

ఆ అలవాటు నాకు లేదు.. ప్రేక్షకులకు విజ్ఞప్తి

ఆ అలవాటు నాకు లేదు.. ప్రేక్షకులకు విజ్ఞప్తి

ఇక తాను ఈ సినిమాలోని ‘సిత్తరాల సిరపడు' పాటలో సిగరెట్ తాగుతూ కనిపించానని.. కానీ దయచేసి మీరు మాత్రం నన్ను ఫాలో అయి సిగరెట్ కాల్చడం వంటివి చేయకండి అంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు బన్నీ. తనకు నిజ జీవితంలో అసలు ఆ అలవాటే లేదు అని ఆయన తెలిపారు.

‘అల వైకుంఠపురములో' కలెక్షన్ల సునామీ

‘అల వైకుంఠపురములో' కలెక్షన్ల సునామీ

మరోవైపు 20 రోజులు గడిచినా ‘అల వైకుంఠపురములో' కలెక్షన్ల సునామీ ఆగడం లేదు. ఇప్పటికీ 250 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా 300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ తిరిగి టాక్ ఎక్కడం ఆయన అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది.

‘అల వైకుంఠపురములో'.. మేజర్ అసెట్ అదే మరి

‘అల వైకుంఠపురములో'.. మేజర్ అసెట్ అదే మరి

‘అల వైకుంఠపురములో' సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. నివేదా పేతురాజ్, సుశాంత్, టబు, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం సినిమాకు మేజర్ అసెట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X