సంక్రాంతి బిగ్ ఫైట్.. 'అల వైకుంఠపురములో' ఫేక్ రిపోర్ట్స్ ఇస్తున్నారా? ఇదిగో ప్రూఫ్..
టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య నెలకొన్న పోటీ వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ సంక్రాంతి విన్నర్ మా హీరో అంటే అంటే మా హీరో అని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'అల.. వైకుంఠపురములో' యూనిట్ ఫేక్ కలెక్షన్ రిపోర్ట్స్ స్ప్రెడ్ చేస్తోందనే టాక్ వచ్చింది. దీంతో తాజాగా ఈ ఇష్యూపై స్పందిస్తూ ప్రూఫ్ ఇచ్చారు ఫ్యాన్స్. వివరాల్లోకి పోతే..

గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని కాంపిటేషన్
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్‌లో పోటీ పడుతున్నారు. తమ తమ సినిమాలతో ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా తపడుతున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో సినిమాల మధ్య నెలకొన్నంత పోటీ వాతావరణం గతంలో ఎప్పుడూ ఏ సినిమాల విషయంలో కనిపించలేదు.

కలెక్షన్ల సునామీ.. తామంటే తామే అంటూ
సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో రూపంలో రెండు భారీ సినిమాలు పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకు రావడంతో తామంటే తామే బెటర్ కలెక్షన్స్ రాబట్టామంటూ కృష్ణా జిల్లాలో పలు రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాకు సంబంధించి వచ్చిన కలెక్షన్ రిపోర్ట్స్ ఫేక్ అనే టాక్ వినిపించింది. దీంతో దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఫ్యాన్స్.

మల్టిప్లెక్స్ థియేటర్స్ ఆ సినిమాకే.. ఫేక్ రిపోర్ట్స్
కృష్ణా జిల్లాలో 'అల.. వైకుంఠపురములో' సినిమావి ఫేక్ రిపోర్ట్స్ అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఓ విషయం చెప్పారు. ఈ జిల్లాలో సరిలేరు నీకెవ్వరు సినిమాకు 73 థియేటర్స్ కేటాయిస్తే.. 'అల.. వైకుంఠపురములో' సినిమాకు 62 థియేటర్లే కేటాయించారని తెలిపారు. అలాగే ఎక్కువ మల్టిప్లెక్స్ థియేటర్స్ సరిలేరు నీకెవ్వరు సినిమాకే కేటాయించారని చెప్పారు.

బెన్ఫిట్ షోస్ కూడా దానికే.. అయినా
అంతేకాదు బెన్ఫిట్ షోస్ కూడా అల.. వైకుంఠపురములో కంటే సరిలేరు నీకెవ్వరు మూవీకే ఎక్కువగా పడ్డాయని అంటున్నారు. అయినప్పటికీ కృష్ణా జిల్లాలో అల.. వైకుంఠపురములో సినిమా 3.1 కోట్ల షేర్ వసూలు చేయగా, సరిలేరు నీకెవ్వరు మూవీ 3.07 కోట్ల రూపాయలే రాబట్టిందని పేర్కొంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఒక్కరోజు తేడాలో.. పోటీ తీవ్రతరం
మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాలు రెండు కూడా సింగిల్ డే గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. ముందుగా జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' మూవీ వచ్చి సూపర్ సక్సెస్ అనిపించుకుంది. ఆ మరుసటి రోజే జనవరి 12న 'అల.. వైకుంఠపురములో' మూవీ రిలీజై ప్రేక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ రెండు సినిమాల నడుమ పోటీ తీవ్రతరమైంది.
Recommended Video

'అల.. వైకుంఠపురములో' మూవీ
త్రివిక్రమ్- అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో హాట్రిక్ మూవీగా 'అల.. వైకుంఠపురములో' తెరకెక్కింది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం పట్ల యూనిట్ సంతోషంగా ఉంది.


Click it and Unblock the Notifications










