twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ala vaikunthapurramuloo First show First talk: త్రివిక్రమ్ మార్క్.. స్టైలిష్ స్టార్ ఎనర్జీ లెవెల్స్.

    |

    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ హ్యాట్రిక్‌పై కన్నేయడంతో అల వైకుంఠపురంలో మూవీపై అంచనాలు పెరిగాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత అలా వైకుంఠపురం చిత్రం కోసం ఈ జోడి రిపీట్ కావడంతో ప్రాజెక్ట్‌కు క్రేజ్ పెరిగింది. ఇలాంటి సినిమాపై ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

    ఎమోషనల్ పాయింట్‌తో కథ

    ఎమోషనల్ పాయింట్‌తో కథ

    ఫస్టాఫ్‌లో టబు, రోహిణి, మురళీ శర్మ, జయరాం మధ్య ఎమోషనల్స్ సీన్స్‌తో కథ మొదలైంది. బంటుగా అల్లు అర్జున్, రాజ్‌గా సుశాంత్ బాల్యానికి సంబంధించిన సన్నివేశాలతో స్టోరీని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ప్లాన్ చేశారు. సుశాంత్‌కు మరదలుగా నివేదా పేతురాజ్ ఎంట్రీ ఇచ్చింది.

    అన్ని అంశాలతో గ్రిప్పింగ్‌గా

    అన్ని అంశాలతో గ్రిప్పింగ్‌గా

    కామెడీ, ఎమోషనల్ పాయింట్ల మీద కథను త్రివిక్రమ్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వీటికి యాక్షన్ సీన్‌ను కూడా జత చేశాడు. బన్నీ, నవదీప్ గ్యాంగ్ మధ్య ఓ డిఫరెంట్ ఫైట్‌ను కథలోకి తెచ్చారు. అలా కథను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఆసక్తిగా మార్చాడు. త్రివిక్రమ్ మార్క్ మాటలు, అల్లు అర్జున్ స్టైలిష్ బిహేవియర్‌తో కథ సాగింది.

    పాటలు, డ్యాన్సులతో అల్లు అర్జున్

    పాటలు, డ్యాన్సులతో అల్లు అర్జున్

    అల వైకుంఠపురంలోని క్రేజీ సాంగ్స్‌లో ఒకటైన ఓ మై డాడి పాట తెర మీదకి వచ్చేసింది. స్టైలిష్ స్టార్ తన స్టయిలీష్ స్టెప్పులతో అదరగొట్టారు. పాటలు, ఫైట్లు, ఎమోషనల్ సీన్లను పేర్చుకొంటూ రోటిన్ కథను ఆసక్తిగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్ ఓ ట్రావెల్ కంపెనీలో చేరడం, పూజా హెగ్డేతో ప్రేమలో పడటం లాంటి చకచకా జరిగిపోయాయి. అల్లు అర్జున్, పూజా మధ్య కెమిస్ట్రీ కొత్తగా ఉంది.

    పారిస్ ఎపిసోడ్స్

    పారిస్ ఎపిసోడ్స్

    కథ గమనం వేగం పుంజుకొని సీన్ పారిస్‌కు మారింది. నవదీప్, రాహుల్ రామకృష్ణ, బన్నీ, పూజా హెగ్డేలతో పారిస్‌లో హంగామా మొదలైంది. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన సామజవరగమన పాటతో ప్రేక్షకుల్లో మరింత కిక్కు పెరిగేలా చేసింది. అప్పలనాయుడుగా సముద్రఖని క్యారెక్టర్ కథలోకి ఎంట్రీ ఇచ్చింది. బిజినెస్ వ్యవహారాలు, బోర్డు మీటింగ్‌లో కథలో సీరియెస్‌నెస్ పెరిగింది.

    కంపెనీల గొడవలతో కథలో సీరియస్‌నెస్

    కంపెనీల గొడవలతో కథలో సీరియస్‌నెస్

    సెకండాఫ్‌లో అల వైకుంఠపురంలో అసలు కథను మొదలుపెట్టారు. యాక్టర్ జయరాం కంపెనీలో గొడవలతో కథలో ట్విస్ట్ చోటు చేసుకొన్నది. ఈ క్రమంలో తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ప్రజాపతిగా రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో కథలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రేక్షకుల అటెన్షన్ పెరిగేలా చేసింది.

    ఎమోషనల్ క్లోజింగ్

    ఎమోషనల్ క్లోజింగ్

    సెకండాఫ్‌లో కూడా వినోదాన్ని బేస్‌గా చేసుకొని యాక్షన్, ఎమోషనల్‌తోనే కథను అల్లుకొన్నాడు. రాములో రాములా పాటను అద్భుతంగా చిత్రీకరించారు. రొటీన్‌గా సాగుతున్న కథకు ఎమోషనల్ క్లైమాక్స్‌తో టచ్ ఇచ్చాడు. అల వైకుంఠపురం ఓ ఎమోషనల్ నోట్‌తో ముగుస్తుంది. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా మార్చడంతో ప్రేక్షకుడు సినిమా ముగిసిన తర్వాత హ్యాపీగా బయటకు వచ్చేలా సింపుల్‌గా త్రివిక్రమ్ సినిమాను ముగించాడని చెప్పవచ్చు.

    English summary
    Allu Arjun, Trivikram Srinivas hands combined together for Ala vaikunthapurramuloo. This movie released on January 12, 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X