twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల వైకుంఠపురంలో మ్యూజికల్ ఫెస్టివల్: ఫైట్స్ కాదు.. స్టేజ్‌పై స్టెప్పులేసిన రామ్ లక్ష్మణ్

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురంలో'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో "అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను " వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నారు.

    బన్నీకి నేను పెద్ద ఫ్యాన్

    బన్నీకి నేను పెద్ద ఫ్యాన్

    మెగా ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. బన్నిగారికి నేను పెద్ద ఫ్యాన్స్. నా కెరీర్‌లో ఇదే నాకు అతిపెద్ద ప్రాజెక్ట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. సునీల్‌తో పనిచేయడం హ్యాపీగా ఉంది. దిల్ రాజు, అల్లు అరవింద్, చినబాబుకు నా థ్యాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను అని నివేదా పేతురాజ్ అన్నారు.

     త్రివిక్రమ్ నా గురువు కావడం

    త్రివిక్రమ్ నా గురువు కావడం

    గేయ రచయిత కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. అల వైకుంఠపురములో నాకు అవకాశం కల్పించిన హారిక, హాసిని ప్రొడక్షన్, నిర్మాతలకు, బన్నీకి థ్యాంక్స్. ప్రతీ ఒక్కరికి జీవితంలో గురువు ఉంటారు. నా జీవితంలో నాకు గురువుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు.

    మెగా ఫ్యాన్స్ ఇరగ్గొట్టేస్తారు..

    దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఈ రోజు వైకుంఠ ఏకాదశమి.. అక్కడ వెంకటేశ్వర స్వామి.. ఇక్కడ త్రివిక్రమ్ గారు.. అల వైకుంఠపురములో సెట వేశాడు. మీరు మాములోళ్లు కాదు సర్.. బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నారు. తమన్ పాటలతో కొట్టేశాడు.. బన్నీ డ్యాన్సులతో, త్రివిక్రమ్ మాటలతో కొట్టేస్తాడు.. ఇక సినిమా బాగుందంటే.. మెగా ఫ్యాన్స్ ఇరగ్గొట్టేస్తారు.

    ఆఫర్లను వదులుకోలేకపోతున్నాను..

    తమిళంలో ఓ సినిమాకు డైరెక్ట్ చేశాను. కానీ తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి. దాంతో యాక్టింగ్ ఆఫర్లను వదలుకోలేకపోతున్నాను. మళ్లీ సినిమాకు దర్శకత్వం వహిస్తాను. ఈ లోపు వచ్చిన రోల్స్ చేస్తూ ఉంటాను. అల వైకుంఠపురంలో నాకు మంచి పాత్ర లభించింది అని నటి రోహిణి అన్నారు.

    స్టెప్పులేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్లు

    అల వైకుంఠపురంలో అవకాశం ఇచ్చినందుకు అల్లు అరవింద్, త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్. అల్లు అర్జున్ ఎంత బాగా స్టెప్పులేస్తాడో.. ఫైట్స్ కూడా అంతే స్టైల్‌గా చేశాడు. ఈ వైబ్రేషన్స్ చూస్తుంటే మాకు ఫైట్ కాదు.. ఓ పాటకు స్టెప్పులేయాలనిపిస్తుంది అని రామ్ లక్ష్మణ్ మాస్టర్లు అన్నారు. ఆ తర్వాత పాటకు స్టెప్పులేశారు. ఓ రోజంతా కష్టపడి పాటను పదే పదే విని బాగా డిజైన్ చేశారని, ఈ చిత్రం తరువాత ఫైట్ మాష్టర్లుగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గానూ అవకాశాలు వస్తాయని త్రివిక్రమ్ అన్నాడు.

    English summary
    Ala Vaikunthapurramuloo Pre Release Event LIVE: watch Allu Arjun's Ala Vaikunthapurramuloo pre release event live here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X