ఆ సమయంలో టబు ఇంట్లో.. చాలా బాగా చూసుకుంది.. సుశాంత్ స్పీచ్

నా పేరు సూర్య తరువాత గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో సినిమాతో దాన్ని పూడ్చేందుకు సిద్దమయ్యాడు. గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అంటూ క్లారిటీ ఇస్తూ వదిలిన 'అల' గ్లింప్సెస్ నుంచి రీసెంట్‌గా వదిలిన టైటిల్ ట్రాక్ వరకు అల వైకుంఠపురములో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే పోతోంది. మ్యూజికల్ సెన్సేషనల్‌గా మారిన అల వైకుంఠపురములో ఆల్బమ్ బన్నీ ఫ్యాన్స్‌నే కాక సినీ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమైంది. విడుదలకు దగ్గర పడుతుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో నేటి సాయంత్రం అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేసింది యూనిట్. ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్‌ మీకోసం..

సుశాంత్ మాట్లాడుతూ.. స్టైలీష్ స్టార్, గురూజీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నేను రెండేళ్లకు ఒక సినిమాచేసినా.. నన్ను ఆదరించే అక్కినేని ఫ్యాన్స్‌కు, తెలుగు సినీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నన్ను ఈ సినిమాలో సెలెక్ట్ చేసినందుకు బన్నీ, త్రివిక్రమ్‌కు థ్యాంక్స్. నాగవంశీ ఫస్ట్ ఫోన్ చేసి ఈ పాత్ర గురించి చెప్పారు. అయితే త్రివిక్రమ్ గారిని కలిశాక.. స్టోరీ చెప్పారు.. అయితే అప్పటికీ కథ ఇంకా పూర్తి కాలేదు. మళ్లీ కథ, క్యారెక్టర్‌ గురించి చెబుతానని త్రివిక్రమ్ అన్నారు. అయితే మళ్లీ కథ చెప్పకండి.. సినిమాను చేస్తానని చెప్పాను.

Ala Vaikunthapurramuloo Musical Concert Sushanth Speech

ఎందుకంటే ఈ చిత్రం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని ఓకే చెప్పాను. ఇలా ఇన్ని రకాలుగా చేయోచ్చా అని నాకు తెలిసింది. ఇంత పెద్ద స్టార్ అయినా అంత హంబుల్‌గా ఉంటాడు. బన్నీతో ఫీల్ అయిన కంఫర్ట్ ఇంకెవరితోనూ ఫీల్ కాకపోవచ్చు. నిన్నే పెళ్లాడతా సెట్‌లో టబు గారిని ఫస్ట్ టైమ్ చూశాను.. మళ్లీ ముంబైలో యాక్టింగ్ కోర్స్ చేయడానికి వెళ్లినప్పుడు చూశాను.. ఇంట్లో పెట్టుకుని చాలా బాగా చూశారు. పూజా, నివేదా, మురళీ, సునిల్ అందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో నేను చాలా బాగున్నానని అందరూ అంటున్నారు.నన్ను చాలా బాగా చూపించింనందుకు వినోద్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాల'ని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X