Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల వైకుంఠపురంలో ట్విట్టర్ రివ్యూ.. హ్యట్రిక్ మ్యాజిక్ దిశగా బన్నీ, త్రివిక్రమ్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత అలా వైకుంఠపురం చిత్రం కోసం మళ్లీ ఈ జోడి చేతులు కలిపింది. షూటింగ్ దశలోనే ఈ చిత్రం భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్, 'గీతాఆర్ట్స్' అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా యూఎస్, ఆంధ్రాలో ప్రీమియర్లు మొదలైన నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్ల ఫీడ్ బ్యాక్ ఇలా ఉంది.
|
అల వైకుంఠపురంలో
అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్
సెకండాఫ్ మాస్
బన్నీ ఫెర్ఫార్మెన్స్ టాప్ లెవెల
సాంగ్స్ అండ్ బీజియం సూపర్బ్
పూజా హెగ్డే, నివేథా గుడ్
సంక్రాంతి రేసులో ఈ సినిమా విన్నర్.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
|
అల్లు అర్జున్ ఇరుగ దీశాడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇరుగ దీశాడు. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా అమెరికాలోని 144 సెంటర్లలో 440k డాలర్లు వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్‌లో నెంబర్ వన్ సినిమాఅవుతుంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
|
సంక్రాంతి పండగ రేసులో
సంక్రాంతి పండగ రేసులో అల వైకుంఠపురంలో 100 విన్నర్. ప్రతీ విషయంలో ఫర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ విన్నర్. బాక్సాఫీస్ వసూళ్లు మార్మోగడం ఖాయం.
|
కింగ్ కల్యాణ్ సాంగ్
కింగ్ కల్యాణ్ సాంగ్.. థ్యాంక్యూ బన్నీ.. అల వైకుంఠపురంలో సినిమా పరిస్థితి ఇది అంటూ..
|
అల్లు అర్జున్, మురళీ శర్మ పెర్ఫార్మెన్సెస్
ఫస్టాఫ్ బాగుంది. అల్లు అర్జున్, మురళీ శర్మ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. స్క్రీన్ మీద అన్ని పాటలు అదిరిపోయాయి. త్రివిక్రమ్ మాటలతో మరోసారి ఆకట్టుకొన్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
|
అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్ పక్కన పెడితే..
అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్ పక్కన పెడితే.. సచిన్ కేల్కర్, మురళీశర్మ, జయరాం యాక్టింగ్‌తో అదరగొట్టారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
|
తలవంచి నమస్కరిస్తున్నా
త్రివిక్రమ్ మూవీ అమేజింగ్. అల వైకుంఠపురంలో సినిమా చూసిన తర్వాత తలవంచి నమస్కరించాలనిపిస్తున్నది. మరోసారి మీరు అదరగొట్టారు అని ఓ ప్రేక్షకుడు ట్విట్ట్ చేశాడు.
|
త్రివిక్రమ్ మార్క్ క్లియర్‌గా
అల వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్. త్రివిక్రమ్ మార్క్ క్లియర్‌గా కనిపిస్తుంది. అల్లు అర్జున్ మరోసారి ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకొన్నాడు. పూజా హెగ్డే యాక్టింగ్, గ్లామర్‌తో మెప్పించింది. ఈ చిత్రంలో ప్రతీ పాత్ర నటన బాగుంది.

త్రివిక్రమ్ డైలాగ్స్. మూడు పాటలు
ఫస్టాప్ అయిపోయింది. త్రివిక్రమ్ డైలాగ్స్. మూడు పాటలు అద్భుతంగా చిత్రీకరించారు. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్. తమన్ మ్యూజిక్ సూపర్. ఇంటర్వెల్ సినిమాకు హైలెట్. స్టోరీ కొత్తగా లేదు. కానీ నీట్‌గా ప్రజెంట్ చేశారు అని పలువురు నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.
|
మేనరిజమ్స్‌తో
అల వైకుంఠపురంలో సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ మరింతగా ప్రేమించాల్సిందే. వేరే మార్గం ఉండదు. ఆయన మేనరిజమ్స్‌తో అదరగొట్టారు. ఇప్పటికే సినిమా సక్సెస్ సంబరాలు మొదలయ్యాయి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.