Taraka Ratna ఆఖరి ఫొటోను షేర్ చేసిన భార్య ఆలేఖ్య.. అమ్మా బంగారు అంటూ ఎమోషనల్!
నందమూరి తారకరత్న ఇటీవల హఠాత్తుగా కన్నుమూయడం ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా తీవ్ర శోకసంద్రంలో నెట్టివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 39 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించడం అందరిని షాక్ కు గురి చేసింది. అయితే తారకరత్న కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఈ విషాదం నుంచి ఏ మాత్రం కోలుకోలేదు.
ముఖ్యంగా అతని భార్య తారకరత్నకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక తారకరత్న గుండెపోటు రావడానికి రెండు మూడు రోజుల ముందు గుడికి కలిసి వెళ్లారు. ఇక ఆ చివరి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

కొన్ని అడుగులు వేసేలోపే..
హీరోగా అంతగా సక్సెస్ కాలేక పోయినప్పటికీ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలి అని ఇటీవల తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తారకరత్న కొన్ని రోజులకే మృతి చెందడం తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటుగా మిగిలింది. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని తారకరత్న కొన్ని అడుగులు వేసేలోపే కార్డియక్ అరెస్ట్ కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.

ఆసుపత్రిలోనే..
ఇక దాదాపు 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న తప్పకుండా తిరిగి వస్తాడు అని కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో ఎదురు చూశారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. తారకరత్న ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడంతో చివరిగా అతనికి మరోసారి గుండెపోటు వచ్చింది. దీంతో హాస్పిటల్ లోనే తారకరత్న కన్నుమూయడం జరిగింది.

తట్టుకోలేని బాధలో జానకి
ఇక తారకరత్న భార్య ఆ ఘటన నుంచి ఇంకా ఏమాత్రం కోలుకోలేదు. వారి పిల్లలు కూడా తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. తారకరత్నకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఇటీవల చిన్న కర్మ రోజు కూడా ఫోటో ముందు ఎంతగానో రోదించింది. అంతేకాకుండా రీసెంట్ గా తారకరత్న 40 జన్మదిన సందర్భంగా కూడా ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు.

ఎదిరించి ప్రేమ వివాహం
అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఎదిరించి మరి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక వారికి పిల్లలు జన్మించిన తర్వాత మళ్ళీ బాలకృష్ణ ప్రత్యేకంగా చేరదీసి అందరికీ దగ్గరయ్యేలా చేశారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఇప్పుడిప్పుడే తారకరత్న మంచి లీడర్ గా ఎదుగుతున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.

చివరి ఫొటో వైరల్
ఇక తారకరత్న చివరి ఫోటోను అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. చాలా ఎమోషనల్ గా స్పందించిన ఆమె భర్తతో చివరిగా తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటో మా చివరి ఫోటో అవుతుందని అనుకోలేదని బాధపడుతూ వివరణ ఇచ్చింది. ఆ ఫొటోలో పిల్లలు కూడా ఎంత చక్కగా నవ్వుతూ కనిపించారు.

అమ్మా బంగారు అని పిలిస్తే..
అలాగే ఇదే ఆఖరి ట్రిప్ అనే విషయం కూడా నా హృదయాన్ని ముక్కులు చేస్తోంది అంటూ.. ఇదంతా కలలా మారి నువ్వు తిరిగి వచ్చి.. అమ్మా బంగారు అని పిలిస్తే వినాలని ఉంది అంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు. ఇక ఫ్యాన్స్ కూడా తారకరత్న ఆఖరి ఫొటోను చూసి చాలా ఎమోషనల్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











