తారకరత్న భార్య విజయసాయిరెడ్డికి బంధువు!
నందమూరి హీరో తారకరత్న ఇటీవల అలేఖ్య రెడ్డి అనే యువతిని రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే అలేఖ్యరెడ్డి జగన్ అక్రమ ఆస్తుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న విజయసాయిరెడ్డి బంధువు అని. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం అలేఖ్య రెడ్డి రిటైర్డ్ ఆర్డీఓ మధు సూదన్ రెడ్డి కుమార్తె. కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆడిటర్ విజయసాయిరెడ్డి అలేఖ్యకు అంకుల్ వరుస అవుతారు.
ఆగస్టు 2న సంఘీటెంపుల్‌లో జరిగిన తారకరత్న-అలేఖ్యరెడ్డి రహస్య వివాహానికి అలేఖ్యరెడ్డి మదర్, గ్రాండ్ మదర్ హాజరయ్యారు. తండ్రి సుదర్శన్ రెడ్డి మాత్రం అనారోగ్య కారణాలతో రాలేక పోయారు. తారకరత్న కుటుంబం నుంచి ఒక్క వ్యక్తి కూడా రాలేదు. కేవలం తారకరత్న స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వచ్చారు.
మరో రూమర్ ఏమంటే...నందీశ్వరుడు సినిమాకి తారకరత్నకు కాస్టూమ్ డిజైనర్ గా పని చేసిన అలేఖ్యరెడ్డి ఇకపై తారకరత్న సినీ వ్యవహారాలన్నింటినీ తన గుప్పిట్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ఆయన డేట్స్, పేమెంట్స్ వ్యవహారాలు లాంటివి అలేఖ్యరెడ్డి మెయింటేన్ చేయనుందట.


Click it and Unblock the Notifications











