»   » పవన్‌కల్యాణ్ తో స్నేహం గురించి అలీ

పవన్‌కల్యాణ్ తో స్నేహం గురించి అలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan and Ali
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, అలీ మద్యన చాలా మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అలీ ఈ రోజు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడారు. ఆయన మాటల్లో పవన్ మీద అభిమానం వ్యక్తం అయ్యింది.

అలీ మాటల్లో... 'గోకులంలో సీత' నుంచీ పవన్ తో నా స్నేహం కంటిన్యూ అవుతోంది. నేను చూసిన అతి మంచిమనుషుల్లో పవన్ ఒకరు. చాలా తక్కువమందితో స్నేహం చేస్తారు. వారిలో నేనూ ఒకణ్ణి. ఎలాంటి నేపథ్యం లేకుండా కష్టపడి నేను ఎదిగిన తీరు పవన్‌కి ఇష్టం.


అందుకే నన్ను అభిమానిస్తాడాయన. ఇన్నాళ్ల మా స్నేహంలో పవన్ ఒక వ్యక్తిని విమర్శించడం కానీ, ఒకర్ని తప్పుగా మాట్లాడటం కానీ నేను వినలేదు. మేం జోకులేస్తుంటే నవ్వుతాడు తప్ప, తను మాత్రం పెదవి విప్పడు. అంత సంస్కారవంతుడు తను అన్నారు.

తెరపై నవ్వులు పూయిస్తున్న అలీకి అకాడెమీ ఆఫ్‌ యూనివర్శల్‌ గ్లోబ్‌ పీస్‌ సంస్థ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయబోతోంది. ఈ విషయం తెలిసి అలీని ప్రముఖ హీరో పవన్‌కల్యాణ్‌ అభినందించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో 'అత్తారింటికి దారేది?' చిత్రీకరణ సాగుతున్న సమయంలో ప్రత్యేకంగా కేక్‌ తెప్పించి సందడి చేయించారు. ఈ సందర్భంగా అలీని దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అభినందించారు.

English summary
Pawan Kalyan and Ali share a good bonding. Ali has appeared in almost all Pawan films right from Toliprema to Cameraman Gangatho Rambabu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu