పవన్ కళ్యాణ్, మీరు ఎందుకు గొడవ పడ్డారు? రేణు దేశాయ్ ప్రశ్నకు అలీ ఫన్నీ ఆన్సర్!

Recommended Video

Ali Explained About Pawan Kalyan And Nelluru Controversy To Renu Desai || Filmibeat Telugu

'అలీతో సరదాగా' కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ షోలో ఆమె తన సినిమా రెరీర్, పర్సనల్ లైఫ్, పిల్లలు, తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్.. అలీని కూడా ఓ ప్రశ్న అడిగారు.

అలీ గారు మిమ్మల్ని కూడా ఓ సీరియస్ ప్రశ్న అడుగుతున్నాను. కొన్ని నెలల క్రితం మీ గురించి ఓ ఆర్టికల్ చదివాను. మీకు, కళ్యాణ్ గారికి పెద్ద గొడవ అయిందట కదా.. నిజమా? అని రేణు దేశాయ్ అడగ్గా అలీ ఫన్నీ సమాధానం ఇచ్చారు.

ఆయన కరాటే, నేను కుంగ్ ఫూ

ఆయన కరాటే, నేను కుంగ్ ఫూ

‘‘ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ వచ్చింది కదా... ఆ అమ్మాయి కోసం మేమిద్దరం కొట్టేసుకున్నాం. ఆయన కరాటే చేశారు, నేను కుంగ్ ఫూ చేశాను. లేకుంటే ఏమిటి.. మాకేం ఉంటాయి గొడవలు'' అని అలీ వ్యాఖ్యానించారు. జోక్ చేయడం కాదు.. నిజంగా ఆ వార్తలు రావడానికి కారణం ఏమిటో చెప్పండి అంటూ రేణు దేశాయ్ కోరగా అలీ అసలు విషయం వెల్లడించారు.

ఏం జరిగిందో చెప్పిన అలీ

ఏం జరిగిందో చెప్పిన అలీ

‘‘నెల్లూరు రొట్టెల పండగ చాలా ఫేమస్.. లాస్ట్ ఇయరే మమ్మల్ని రమ్మని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పండి అంటే.. సరే చెప్పడం నా బాధ్యత, వస్తారో రారో అనేది ఆయన ఇష్టం అన్నాను. అనుకోకుండా అదే రోజు ఆయన్ను నెల్లూరులో చదువుకున్నటి టీచర్స్, ఫ్రెండ్స్ ఆయనతో మీటింగ్ పెట్టుకున్నారు. అదే రోజు రొట్టెల సాయంత్రం పండగ. ఆ పండగకు దాదాపు 10 లక్షల మంది వస్తారు. నేను తీసుకెళ్లి దర్శనం చేయించి వచ్చాను. తర్వాత చాలా సేపు కార్లో మాట్లాడుకున్నాం. ఇలా వెబ్ సైట్లలో మన మధ్య గొడవైనట్లు వస్తోంది, మీరు నేను దెబ్బలాడుకున్నామని చెప్పారు. అపుడు ఆయన(పవన్ కళ్యాణ్) మీరు ఏం చెప్పారని అడిగారు. అమెరికా నుంచి ఇవాంక వచ్చింది కదా ఆమె కోసం ఇద్దరం కొట్టేసుకున్నాని చెప్పడంతో ఆయన కూడా మీలాగే నవ్వుకున్నారు.'' అని అలీ స్పష్టం చేశారు.

వదినా అని పిలిచి అలా చేయడం కరెక్ట్ కాదు

వదినా అని పిలిచి అలా చేయడం కరెక్ట్ కాదు

మీరు బయటకు వెళ్లినపుడు అందరూ వదినా వదినా అని పిలుస్తారు. అది మీకు గౌరవంగా అనిపిస్తుందా? ఇబ్బంగా అనిపిస్తుందా? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ రియాక్ట్ అవుతూ... వారు ప్రేమగా వదినా అంటే ఇబ్బంది లేదు. కానీ నేను వదినా అయినందు వల్ల పలానా పనులు చేయకూడదు అంటూ కొందరు ఓనర్‌ఫిప్ చూపిస్తారు. అది కరెక్ట్ కాదు అన్నారు.

ఇబ్బంది పడతాను

ఇబ్బంది పడతాను

ప్రేమతో చాలా మంది అన్నా, చెల్లి, వదినా, అక్క అని పిలుస్తుంటారు. అలా పిలిచినపుడు సంతోషంగా ఉంటుంది. వదిన అనేది బ్యూటిఫుల్ వర్డ్. కానీ వారు వదినా అని పిలిచి.. దాని వెనక నా మీద పెద్ద వ్యాసం రాస్తారు. నువ్వు అలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎలా నడవాలి, ఎలా ఉపిరి పీల్చుకోవాలి అనే విధంగా సూచనలు చేస్తుంటారు. అలా చేసినపుడు ఇబ్బందిగా ఉంటుందని రేణు దేశాయ్ తెలిపారు.

రేణు దేశాయ్

రేణు దేశాయ్

కొన్ని అంశాలపై వన్ వర్డ్ సమాధానం ఇవ్వాలని కోరగా రేణు దేశాయ్ క్రింది విధంగా స్పందించారు

రేణు దేశాయ్: హ్యాపీ సోల్
అకీరా: ఆసమ్ సోల్
ఆద్యా: నా దేవి.. నా దుర్గాదేవి
పెళ్లి: బ్యూటిపుల్ కాన్సెప్ట్
డైరెక్షన్: మై సోల్
బద్రి: హ్యాపీ, అలా జరిగిపోయింది
పూరి జగన్: గ్యాటిట్యూడ్
తెలుగు భాష: ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్... నాకు బాగా నచ్చింది
మరాఠీ: మాతృబాష
అలీ: ఫ్యామిలీ, అన్నయ్య

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X