సంక్రాంతికి థియేటర్లలో అలీ నవ్వులు
అలీ కామెడీ ఈ సంక్రాంతికి గిలిగింతలు పెట్టించనుంది. ఆయన తాజా చిత్రం బాడీగార్డ్ లో అలీ బాపట్ల బాబు అనే పాత్రను పోషిస్తున్నాడు. సినిమాలో వెంకటేష్ కు ప్రెండ్ గా ఉండే ఈ పాత్ర చాలా కామిడీగా ఉండబోతోందని సమాచారం. ఫస్ట్ హాఫ్ మొత్తం అలీ,వెంకటేష్ కామిడీలతో నవ్వులు పండిస్తారని చెప్తున్నారు. సెకండాఫ్ లో సెంటిమెంట్, ప్రేమ కలబోతతో క్లైమాక్స్ కు వెళ్తుంది. క్లైమాక్సే సినిమాకు కీలకమై నిలుస్తుంది. ఇక వెంకటేష్ కూడా ఈ చిత్రంపై మంచి కాన్పిడెంట్ గా ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ..''కథ ఎలాంటిదైనా అందులో నా తరహా వినోదం ఉండేలా చూసుకొంటాను. ప్రేక్షకులు నా నుంచి అదే కోరుకొంటారు. అందుకు తగ్గట్టుగానే 'బాడీగార్డ్' సిద్ధమైంది అన్నారు వెంకటేష్. అలాగే..నా హావభావాలకు సరిపడే కథాంశమిది. మొదట నాకే వినిపించారు. కానీ అప్పుడు చేయడం కుదరలేదు. ఆలస్యమైనా ఒక మంచి చిత్రంలో నటించడం ఆనందాన్నిచ్చింది. ఇంటిల్లిపాదికీ చక్కటి వినోదాన్ని పంచుతుంది అంటున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన చిత్రమిది. త్రిష హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Click it and Unblock the Notifications











