twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బలుపు : అలీ పాత్ర వింతగా, కామెడీగా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ త్వరలో విడుదల కాబోతున్న రవితేజ 'బలుపు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో అలీ పాత్ర డాక్టర్ సావిత్రి. మేల్ అండ్ ఫిమేల్ డాక్టర్. ఆయన పాత్ర కాస్త వింతగా, కామెడీగా ప్రేక్షకులు నవ్వుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

    గతంలో రవితేజ హీరోగా వచ్చిన కిక్ చిత్రంలో కూడా అలీ డాక్టర్ బాలి పాత్రలో నటించిన ప్రేక్షకులకు మంచి కామెడీ కిక్ ఇచ్చాడు. ఈ సారి కూడా వీరి కాంబినేషన్ థియేటర్లో నవ్వులు పూయిస్తుందని, ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండేలా కామెడీ సీన్లు ఉంటాయని అంటున్నారు.

    గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. నిర్మాత పరమ్ వి.పొట్లూరి మాట్లాడుతూ- ఇటీవల విడుదల పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించనున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 28న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

    ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జైప్రకాష్‌రెడ్డి, శేఖర్, అజయ్, షఫి, శ్రీనివాసరెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:కోన వెంకట్, పాటలు:సిరివెనె్నల, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతంరాజు, కెమెరా:జయనన్ వినె్సంట్, సంగీతం:తమన్.ఎస్.ఎస్. నిర్మాత:పరమ్ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.

    English summary
    Comedian Ali will be seen as a doctor in Ravi Teja's mass entertainer 'Balupu' releasing on 28th of this month. His character name is Dr.Savithri ( the Male/Female doctor).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X