»   » 'పంచ్‌ అవతార్' గా అలీ కామిడీ ట్రాక్

'పంచ్‌ అవతార్' గా అలీ కామిడీ ట్రాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ దశావతారం చిత్రంలో పాత్రలను ప్యారిడీ చేస్తూ అలీ పంచ్ అవతార్ పేరుతో ఓ పాత్రను 'బ్యాచ్‌లర్స్‌-2'లో పోషిస్తున్నాడు. 'బ్యాచ్‌లర్స్‌' లో నటించిన జకీర్‌ 'బ్యాచ్‌లర్స్‌-2' ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు జకీర్‌ మాట్లాడుతూ...'ఇది యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. 'రోడ్ ట్రిప్‌' అనే చిత్రం ఆధారంగా మన తెలుగు నేటివిటీకి అన్వయిస్తూ తీస్తున్నాం. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ ఓపెన్‌టాప్‌ కారులో ప్రయాణించే ఐదుగురి మధ్య సాగే కథే ఈ చిత్రం. ప్రయాణంలో మర్డర్‌ మిస్టరీ అనేది ట్విస్ట్‌. అలీ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. దశావతారం స్పూర్తితో 'పంచ్‌ అవతార్‌' క్యారెక్టర్‌ను ఆయన పోషిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలుకూడా పూర్తయ్యాయి. వచ్చేనెలలో సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. అలీ మాట్లాడుతూ...'బ్యాచ్‌లర్స్‌లో చిన్న పాత్ర వేశాను. మళ్ళీ ఇందులో నటించడం చాలా హ్యాపీగా ఉంది' అని తెలిపారు.

English summary
Zakir who earlier played the male lead role, directed and produced the film ‘Bachelors’, is now coming up with its sequel as ‘Bachelors -2’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu