ఏక్ నిరంజన్ చిత్రంలో అలీ,బ్రహ్మానందం ట్రాక్ నీచంగా ఉన్నట్లు టాక్ రావటంతో పూరీ దాన్ని దొలిగించమని ధియోటర్స్ కు చెప్పారని సమాచారం. ఈ నిర్ణయం శనివారం సాయింత్రం నుంచి అమలు అవుతుంది. ఇక ఈ కామిడీ ట్రాక్ లో బ్రహ్మానందం భార్య అబినయశ్రీ ని తీసుకెళ్ళటానికి ఆమె మాజీ ప్రియుడు అలీ వస్తాడు. అలీ ప్లాష్ బ్యాక్ లో అభినయశ్రీ,అలీ ప్రేమించుకుంటారు. జ్యోతిష్యం చెప్పే బ్రహ్మానందం వద్దకు జాతకాలు చూపించుకుందామని వస్తారు. అప్పుడు బ్రహ్మానందం ఆమెపై కన్నేసి అలీని తప్పించి ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. దాంతో అలీ మంత్ర,తంత్రాలు మ్యాజిక్ నేర్చుకుని మళ్ళీ వచ్చి బ్రహ్మానందకు ట్విస్ట్ ఇస్తాడు. అతని ఎదురుగానే తన విద్యతో బ్రహ్మం భార్య అభినయ శ్రీ తో సరసమాడుతూంటాడు.ఈ ట్రాక్ ధియోటర్స్ లో పేలలేదు. అంతేగాక వల్గర్ గా ఉంది. రెగ్యులర్ గా పూరీ చిత్రాల్లో కామి్డీని ఆశించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో ఈ ఫీడ్ బ్యాక్ తెలుసుకున్న పూరీ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ప్రభాస్, కంగనా రౌనత్ నటించిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.