సిద్ధార్థ ‘ఓ మై ఫ్రెండ్’లో అలీ ‘చాట’ డైలాగులు
'ఎంద చాట" అంటూ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో తన విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ తో నవ్వులు పండించాడు కమెడియన్ అలీ. మనం అలీ నుంచి మరోసారి ఇలాంటి డైలాగులు వినబోతున్నాం. మళ్లీ వినడం అంటే రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాను మళ్లీ చూడమని చెప్పడం కాదండీ బాబూ....అసలు విషయం వేరే ఉంది.
సిద్ధార్థ, శృతి హాసన్ జంటగా దిల్ రాజు దర్శకత్వంలో 'ఓమై ఫ్రెండ్" సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నవంబర్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అలీ 'చాట" కామెడీ మళ్లీ రీపీట్ కానుందట. అదే జరిగితే థియేటర్లో మరోసారి నవ్వులు ఖాయం.
ఈ సినిమాలో సిద్ధార్థ్, శృతిహాసన్‌తో పాటు హన్సిక, నవదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధినేతలు దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌లు నిర్మిస్తున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఈ ప్రేమకథా చిత్రం నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలకు పేరొందిన ఈ సంస్థ నుండి వస్తోన్న మరో కలర్ ఫుల్, ఫీల్‌గుడ్ మూవీ ఓ మై ప్రెండ్.


Click it and Unblock the Notifications











