»   » సమంత నడుముపై...అలీ చెత్త చేష్టలు!

సమంత నడుముపై...అలీ చెత్త చేష్టలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఆడియో సక్సెస్ మీట్లో కమెడియన్ అలీ సమంతపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆడియో ఫంక్షన్లలో సైతం కాస్త బూతు పదాలు మాట్లాడే అలవాటు ఉన్న అలీ ఈ సారి ఏకంగా సమంత నడుము మీద కామెంట్స్ చేసారు. సమంత నాభి భాగాన్ని విజయవాడ బెంజి సర్కిల్ తో పోలుస్తూ వ్యాఖ్యలు చేసాడు.

సమంతను సౌందర్యరాశిగా పొగడ్తలు గుప్పించిన అలీ....తన చేతలతో నాభి భాగాన్ని చూపిస్తూ ‘ఈ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం. బెంజిసర్కిల్ లా ఉంటుంది' అంటూ కామెంట్ చేసాడు. ఇదే ఫంక్షన్లో సమంత ఉండి ఉంటే ఎలా స్పందించేదో తెలియదు కానీ....ఆమె ఫ్యాన్స్ మాత్రం అలీ కామెంట్స్ పై గుర్రుగా ఉన్నారు. అలీ చేసిన వ్యాఖ్యలు చాలా చీప్ గా ఉన్నాయని సమంత అభిమానులు అంటున్నారు. ఆయన స్థాయికి తగిన విధంగా మాట్లాడలేదని మండి పడుతున్నారు.

ఈ ఆడియో సక్సెస్ మీట్ విజయవాడలోని హాయ్ ల్యాండ్ లో జరిగింది. 'S/o సత్యమూర్తి' చిత్రం ఈ నెత 9న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆడియో వేడుక, ఆడియో సక్సెస్ మీట్లు నిర్వహించడం ద్వారా సినిమాకు పబ్లిసిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

 Ali comments on Samantha

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.

నటీనటులు అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Ali tried to bring attention to Samantha's hip and waist by his comments. 'Samantha's dazzling glamour is unmatchable. Especially I love that area between here to here. It looks like our Benz Circle', said Ali
Please Wait while comments are loading...